లేటెస్ట్

రాజధాని భూముల‌పై సీబీఐ విచారణ

రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌, భూముల‌ కేటాయింపులో అక్రమాలు  జరిగాయని ఆరోపిస్తున్న వైకాపా పెద్దలు దీనిపై సీబీఐ విచారణ జరిపించాల‌ని నిర్ణయించారు. రాజధాని భూముల్లో జరిగిన అక్రమాల‌పై సీబీఐ విచారణ జరిపించాల‌ని జీవో నెం.46 విడుదల‌ చేశారు. వైకాపా అధికారంలోకి రాకముందే రాజధానిలో అక్రమాలు జరిగాయని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుల‌కు రాజధాని ఎక్కడ పెడుతున్నారో ముందే చెప్పేసి వారి చేత భూముల‌ను కొనుగోలు చేయించి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్ప‌డ్డార‌ని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రులు కమిటీని ఏర్పాటు చేసిన వైకాపా ప్రభుత్వం, తరువాత దీనిపై ‘సిట్‌’ను ఏర్పాటు చేశారు..ఇటీవల‌ సీఐడీ విచారణకు ఆదేశించగా...ఇప్పుడు సీబీఐతో విచారణ జరిపించాల‌ని కేంద్రానికి లేఖ రాశారు. 

ప్రపంచం మొత్తం ‘కరోనా’ గురించి తీవ్రంగా వణికిపోతుంటే...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా రాజధాని భూములు కొనుగోలులో అక్రమాలు జరిగాయని, భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం దీనిపై వేసిన సీఐడీ విచారణలో ఏమి తేల్చిందని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ‘సిట్‌’ ఏమి తేల్చిందో చెప్పకుండా...హడావుడిగా సీబీఐ విచారణకు ఇవ్వడంలోని మతల‌బు ఏమిటో చెప్పాల‌ని ప్రతిపక్ష టిడిపి డిమాండ్‌ చేస్తోంది. మరో వైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల‌పై హైకోర్టు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే రాజధాని భూముల‌పై సీబీఐ విచారణకు జీవో ఇచ్చారని వారు విమర్శిస్తున్నారు. తన బాబాయి హత్య కేసుపై తమ ప్రభుత్వం ఉన్న‌ప్పుడు సీబీఐ విచారణ కోసం డిమాండ్‌ చేసిన ‘జగన్‌’ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని ‘కరోనా’ వణికిస్తుంటే...దానిపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం రాజకీయ కక్షల‌ను తీర్చుకోవాల‌ను కోవడం సరికాదనే మాట వినిపిస్తోంది.

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ