లేటెస్ట్

కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలు

ఆళ్ళగడ్డ, సెప్టెంబరు 24 (జనం ప్రతినిధి) : ప్రాణాంతకమైన కరోనావ్యాది ఉందని దాని వల‌న ప్రపంచమే వణికిపోతోందని ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. కరోనా ఎక్కడో వచ్చిందిలే మాకేమి అంటూ బయట యథేచ్చగా తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలోని కొన్నిమండలాల్లో, మున్సిపాలిటీలో ప్రజలు రోడ్లపైకి రాకూడదని ప్రభుత్వ అధికారులు ఎంత చెప్పినా వినకుండా రోడ్లపైకి గుంపు గుంపులుగా వస్తూనే ఉన్నారు. ఆటోలో కూలీ పనుల‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గలేదు. ఇకపోతే కూరగాయల‌ మార్కెట్‌ వెళ్తే రద్దీగా ఉంటున్నారు. దీంతో కూరగాయల‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వాలు అధిక ధరల‌కు విక్రయించకూడదని చెప్తున్నారే కానీ అమలు మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. బహిరంగ ప్రదేశాల‌లో తిరిగే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల‌ని ప్రభుత్వాలు సూచను పాటించాల‌ని చెప్తున్నా ప్రజల‌ చెవికెక్కటం లేదు. కరోనా వైరస్‌ నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల‌ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజలు యథేచ్చగా తమ తమ కార్యకలాపాల్లో భాగంగా వీధుల్లోకి వస్తున్నారు.  ఒక పక్క పోలీసు,  వైద్యులు తమ ప్రాణాల‌ను సైతం లెక్కచెయ్యకుండా కరోనా నుండి ప్రజను కాపాడాల‌ని మండు టెండల్లో తమ ప్రయత్నాలు చేస్తుంటే ప్రజల‌కు మాత్రం చీమకుట్టినట్లు కూడా కన్పించలేదు. కొన్నిచోట్ల పోలీసులు ఎర్రని ఎండలో నిల‌బడి ప్రజల‌ను రోడ్లమీదకు రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ప్రజలు మాత్రం వారికి తెలియకుండా దొంగ దారిన రోడ్లపైకి వెళ్తున్నారు. ఆళ్ళగడ్డలో కరోనా వైరస్‌ కేంద్రంలో భాగంగా పోలీసు వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది మండుటెండలో విధులు నిర్వహిస్తుంటే ముస్లిం పోరాట హక్కుల‌ సమితి జిల్లా అధ్యక్షుడు ఆమూరు రఫి మంగళవారం విధులు నిర్వహిస్తున్నవారికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా నియంత్రన విధి నిర్వాహనలో ఉన్నన్ని రోజులు తాము ప్రతిరోజు ఈ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ