లేటెస్ట్

మరో 21రోజుల‌ పాటు లాక్‌డౌన్‌...!

ఈ అర్ధరాత్రి నుంచి మరో 21 రోజు పాటు భారత్‌ మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.  జాతినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సంఘటితంగా పోరాడితేనే ‘కరోనా’పై విజయం సాధించగల‌మని, ‘జనతాకర్ఫ్యూ’ని విజయవంతం చేసినట్లే ‘లాక్‌డౌన్‌’ను విజయవంతం చేయాల‌ని ఆయన ప్రజల‌ను కోరారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’కు మందు లేదని, సామాజిక దూరం పాటించడమే దీనికి నివారణ అని ఆయన అన్నారు. ‘కరోనా’ చాలా వేగంగా వ్యాపిస్తోందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సామాజిక దూరం పాటించకపోతే దీన్ని అరికట్టడం అసాధ్యమని, దీని కోసం ప్రజలు సహకరించాల‌ని ఆయన కోరారు.  

(283)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ