లేటెస్ట్

‘గుంటూరు’లో ‘కరోనా’ కల‌కలం..!

‘గుంటూరు’ నగరంలో ‘కరోనా’ కల‌కలం రేగుతోంది. నిన్న ఒక వ్యక్తికి ‘కరోనా’ పాజిటివ్‌ రావడంతో...మరెంత మంది భయంకరమైన ‘కరోనా’కు గురయ్యారనే భయాందోళను నగరంలో నెల‌కొంటున్నాయి. ‘కరోనా’ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి గత వారం రోజుల‌ నుంచి నగరంలో వివిధ ప్రాంతాలో సంచరించడం, ఆయన ఒక విందులో పాల్గొన్నారని వార్తలు రావడంతో..ప్రజలు, అధికారయంత్రాంగం ఆందోళనకు గురవుతున్నారు. ‘పాజిటివ్‌’ వచ్చిన వ్యక్తిని ‘విజయవాడ’కు తరలించి చికిత్స చేస్తుండగా...ఈ రోజు మరో మూడు అనుమానిత కేసులు గుంటూరు ప్రభుత్వ హాస్పటల్‌లో నమోదు అయ్యాయి. ‘కరోనా’ ల‌క్షణాతో ముగ్గురు వ్యక్తులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వారి నమూనాల‌ను డాక్టర్లు పరీక్షల‌ కోసం పంపించారు. దీంతో ఒక్క రోజే మూడు అనుమానిత కేసులు నమోదు కావడం, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నగరంలో వివిధ ప్రాంతాల్లో, విందుల్లో పాల్గొనడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 2431 మందిని ‘కరోనా’ అనుమానంతో గృహనిర్భంధంలో ఉంచారు.

(293)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ