'సచిన్'లా మేధావిని కాదు...!

తాను క్రికెట్ గాడ్ 'సచిన్ టెండూల్కర్'లా క్రికెట్ మేధావిని కాదని ఇంగ్లాండ్ క్రికెటర్ అకుక్ అన్నాడు. 'సచిన్' ఓ దిగ్గజం అని ఆయన రికార్డులను అందుకోవడం అంత ఈజీ కాదని 'కుక్' అభిప్రాయపడ్డారు. 'సచిన్' కంటే తక్కువ వయసులోనే 10వేల మైలురాయిని అందుకుని 'కుక్' రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత క్రికెటర్ 'సునీల్ గవాస్కర్' మాట్లాడుతూ 'కుక్' టెస్టుల్లో సచిన్ సాధించిన పరుగులను అధిగమిస్తాడని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి 'కుక్' వయస్సు 31 సంవత్సరాలేనని మరో ఐదు,ఆరుసంవత్సరాలు క్రికెట్ ఆడితే మరో 6వేల పరుగులు సాధించవచ్చని తద్వారా సచిన్ సాధించిన 15,921పరుగుల రికార్డు బద్ధలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ అభిప్రాయంతో 'కుక్' ఏకీభవించలేదు. సచిన్ లాంటి క్రికెట్ మేధావి నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును చేరాలంటే నేను ఇంకా దాదాపు ఆరు వేల పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ లక్ష్యం చాలా దూరంలో ఉన్నట్లే. ఎందుకంటే నేను సచిన్ లాంటి మేధావిని కాదు' అని కుక్ వివరించాడు.