లేటెస్ట్

తెంగాణలో ఒక్క రోజులోనే 10 కరోనా కేసులు...!

తెంగాణ ప్రభుత్వం ‘కరోనా’ కట్టడికి అన్ని రకాల‌ చర్యలు తీసుకుంటున్నా ‘పాజిటివ్‌’ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వచ్చిన 10 కేసుల‌తో కలిపి  మొత్తం పాజిటివ్‌ కేసులు 58గా ప్రభుత్వం ధృవీకరించింది. మరో వైపు ‘కరోనా’ను కట్టడి చేసేందుకు తెంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ రోజు విలేకరుల‌ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‘కరోనా’ను ప్రజలు తేలిగ్గా తీసుకోకూడదని, సంపన్న దేశమైన అమెరికానే దీని దెబ్బకు అల్లాడుతుందని, మనం జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రంగా నష్టపోతామని ప్రజల‌ను హెచ్చరించారు. ఎవరూ బయటకు రావద్దని, ఏ ఒక్కరినీ ఆకలితో ఉండనీయమని చెప్పారు. రైతుల‌ను ఆదుకుంటామని, రైతుల‌కు ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరు ఇస్తామని తెలిపారు.

(165)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ