లేటెస్ట్

ఎపిలో మ‌రో ఆరుగురికి క‌రోనా...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  శ‌నివారం నాడు ఆరు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక వైపు క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్నా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండ‌డం ఆందోళ‌న క‌ల్గిస్తొంది. తాజాగా న‌మోదైన ఆరు కేసుల‌తో క‌లిపి పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరిన‌ట్లు వైద్యులు తెలిపారు. మొత్తం 68 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వారు చెప్పారు. మరో 65 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీలో మత సంబంధిత సమావేశాలకు వెళ్లొచ్చిన ఇద్దరితో పాటు  ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. మక్కా నుంచి వచ్చిన కృష్ణా జిల్లాకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. ఇటీవల రాజస్థాన్ వెళ్లొచ్చిన  కర్నూలు జిల్లా నొస్సం గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధికి చెందిన కుటుంబం మొత్తం క్వారంటైన్ కు వెళ్ల‌డం జిల్లాలో క‌ల‌క‌లం రేపుతోంది. జిల్లాలో 1700 ఐసోలేష‌న్ బెడ్ ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ చెప్పారు.

(261)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ