లేటెస్ట్

కొత్త‌గా క‌రోనా కేసులు రావు: కెసిఆర్

ఏప్రిల్7 త‌రువాత తెలంగాణ‌లో కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కావ‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ తెలిపారు. ఇప్పుడున్న క‌రోనా రోగులు వేగంగా కోలుకుంటున్నార‌ని, ఈ రోజు కొత్త‌గా కేసులు న‌మోదు కాలేద‌ని అన్నారు. రాష్ట్రంలో 78 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని వీరిలో 11 మందికి నెగిటివ్ వ‌చ్చింద‌ని, దీంతో ఇంకా 58 మంది రోగులు మిగులుతారని, వీరు కూడా వేగంగా కోలుకుంటున్నార‌ని, క్వారంటైన్లో ఉన్న‌వారిని ప్ర‌త్యేకంగా ఉంచామ‌ని, త్వ‌ర‌లో వారంతా కోలుకుంటార‌ని, ఏప్రిల్ 7 తరువాత కొత్త కేసులు రావ‌ని భావిస్తున్నామ‌ని అన్నారు. ఒకే ఒక్క వ్యక్తి.. 76 సంవత్సరాల వ్యక్తి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సీఎం చెప్పారు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలిపారు. తెలంగాణలో 69 మంది కరోనా బారిన పడ్డారని.. వారిలో 11 మందికి నయం కావడంతో వారిని సోమవారం డిశ్చార్జ్ చేస్తామని.. ఇంకా 58 మందికి చికిత్స కొనసాగుతోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

(191)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ