లేటెస్ట్

‘లాక్‌డౌన్‌’ను కొనసాగించాలి:కెసిఆర్‌

‘కరోనా’ వ‌ల్ల‌ ఏర్పాటు చేసిన ‘లాక్‌డౌన్‌’ను కొనసాగించాని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రధాని మోడీకి తాను లాక్‌డౌన్‌ను కొనసాగించాల‌ని సల‌హా ఇచ్చానని, ‘కరోనా’ తీవ్రమైన వ్యాధి అని, దీనికి మందు లేదని, లాక్‌డౌన్‌ వల్లే కొంత వరకు ‘కరోనా’ను అదుపులోకి తేగలిగామని, ఇప్పుడు కనుక ‘లాక్‌డౌన్‌’ను తీసి వేస్తే..తీవ్రమైన ప్రాణ‌ నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ‘లాక్‌డౌన్‌’ వ‌ల్ల‌ ఆర్థికంగా నష్టం చేకూరినా, ప్రజల‌ ప్రాణాలు ముఖ్యమని, దీని కోసం ‘లాక్‌డౌన్‌’ కొనసాగించాల‌ని ఆయన కోరారు. విపత్కరమైన సమయంలో ‘లాక్‌డౌన్‌’ తప్పదని, ప్రజలు ఇప్పటికే సహకరిస్తున్నారని, మరి కొన్ని రోజులు ఇదే విధంగా సహకరించాల‌ని అన్నారు.

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ