WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిరీస్‌ భారత్‌దే...!

అతి బలహీనమైన జింబాబేపై భారత్‌ సిరీస్‌ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ కోసం ఇక్కడ జరుగుతున్న రెండో మ్యాచ్‌ను భారత్‌ సునాయాసంగా గెలుచుకుని సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. జింబాబ్వే విసిరిన 127పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(33్ష్మ50 బంతుల్లో 4 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌(39 ్ష్మ68 బంతుల్లో 5 ఫోర్లు), అంబటి రాయుడు(41 నాటౌట్ష్మ్‌ 44 బంతుల్లో 7 ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 126 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరును మాత్రమే నమోదు చేసింది. ఆదిలోనే మసకద్జా(9) నిరాశపరచగా, ఆపై మూర్‌(1) కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో 19 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లను నష్టపోయింది. కాగా, చిబాబా(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సిబందా(53) ఆకట్టుకున్నాడు.

(135)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ