WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

స్వలింగ సంపర్కులను దేవుడే శిక్షిస్తాడు...!

స్వలింగ సంపర్కులను దేవుడే శిక్షిస్తాడని ప్లోరిడాలోని గే క్లబ్‌లో నరమేధం సృష్టించిన ఒమర్‌ మతీన్‌ తండ్రి సిద్దిఖీ మతీన్‌ చెప్పాడు. సిద్దిఖీ ఇచ్చిన ఇంటర్వ్యూను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. కాగా 50మందిని కిరాతకంగా హత్య చేసిన ఒమర్‌ మతీన్‌ ఐఎస్‌ఐఎస్‌ సానుభూతిపరుడు కాదని కూడా అతను చెబుతున్నాడు. ఆదివారం ఆర్లెండోలోని నైట్‌ క్లబ్‌లో అఫ్ఘానిస్తాన్‌ సంతతికి చెందిన ఉన్మాది ఒమర్‌ మతీన్‌ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. గే సమాజంపై అసహ్యంతోనే తన కొడుకు దాడికి పాల్పడి ఉండొచ్చని సిద్ధిఖీ చెప్పాడు. ఈ ఘటన జరగడానికి 12 గంటల ముందు తన కొడుకు ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో అతను సాధారణంగా కనిపించాడని తెలిపాడు. ఒమన్‌ అసహనంగా, కోపంగా ఉన్నట్టు అనిపించలేదని చెప్పాడు. నైట్‌ క్లబ్‌లో తన కొడుకు కాల్పులు జరిపాడని తెలియగానే షాక్‌కు గురయ్యాయనని పేర్కొన్నాడు.

(272)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ