WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కింగ్‌ఫిషర్‌' విల్లాకు నేనే కింగ్‌...!

వెస్టిండీస్‌ క్రికెటర్‌ 'క్రిస్‌గేల్‌'కు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్‌లింగ్‌ విజయ్‌మాల్యా రాజభోగాలు చూపించాడట. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు సభ్యుడు అయిన 'క్రిస్‌గేల్‌' విరామం దొరికినప్పుడు 'కింగ్‌ఫిషర్‌' విల్లాలో విహరించాలని ఆయనను కోరాడట. దీంతో 'మాల్యా' ఏర్పాట్లు చేయించాడట. ఈ విషయాన్ని 'గేల్‌' తన జీవిత కథ 'సిక్స్‌ మెషిన్‌: ఐ డోన్ట్‌ లైక్‌ క్రికెట్‌.. ఐ లవ్‌ ఇట్‌' పుస్తకంలో చెప్పాడు. తాను చూసిన హోటళ్ల కంటే 'మాల్యా' విల్లా పెద్దదట. జేమ్స్‌బాండ్‌, ప్లేబాయ్‌ విల్లాలా ఉందట. తెల్ల కాంక్రీట్‌, అద్దాలతో చాలా అందంగా దాన్ని నిర్మించారట. దీనిలో ఓ గది ఇస్తే చాలని తాను భావిస్తే 'మాల్యా' విల్లా మొత్తానికి తనను కింగ్‌ను చేశాడని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ విల్లాలో నేను రాజులా గడిపాను. ఏది కావాలంటే అది క్షణాల్లో వాలిపోయేది. విల్లాలో ఎక్కడికి వెళ్లినా కింగ్‌పిషర్‌ బీర్లు రెడీగా ఉంటాయట. మెనూ తాను ఏం కోరితే అది వచ్చిందట. సినిమా థియేటర్‌, మెర్సిడెజ్‌ కార్లు, హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ తదితర వాహనాలు ఉన్నాయట. మొత్తం మీద విరామం పూర్తి అయ్యాక తాను విల్లాను వీడలేక వీడి వచ్చానని 'గేల్‌' రాసుకున్నారు.

(175)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ