లేటెస్ట్

ప్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ లో సాత్విక్ విజయం సాధించాలి

భీమవరం  :  కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన సాత్విక్ సాయిరాజ్  ప్యారిస్ లో జరుగుతున్న ప్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కు అర్హత సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో సాత్విక్ విజయం సాధించాలని భీమవరం DNR వాకర్స్ మరియు మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన సాత్విక్ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా రాణిస్తున్నారని, చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ లో ప్రపంచ అగ్రస్థానానికి చేరుకురుకొని కొన్ని నెలల నుంచి టాప్ 4 స్పాట్స్ లో ఉన్నారు. 2023 లో టోక్యోలో యోనేక్స్ కంపిటేషన్ లో సాత్విక్ స్మాష్ 565 కే.ఏం.పి.హెచ్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారని రిటైర్డ్ ప్రోపేసర్ పచ్చిగొళ్ళ సుబ్బారావు, DNR కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ k. శివరామరాజు,క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, మావుళ్ళమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఏదైనా టోర్నమెంట్ కు వెళ్ళినప్పుడు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుంటారని స్వాతిక్ అన్ని రంగాల్లోనూ రాణించాలని కోరుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో DNR కళాశాల కోశాధికారి కొత్త శ్రీనివాస్,  కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, చైతన్య భారతి పిఅర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా హనుమంతరావు, జి అజయ్ కుమార్ ( బాబ్జి )బివి నరసింహారాజు, రిటైర్ మాస్టర్. పి సీతారామరాజు, కురిశెట్టి శ్రీనివాస అప్పారావు, గుండు సుమూర్తి, మణి, ఎవి సాయిజీరావు, చవ్వ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ