యువతలో ‘కరోనా’ లక్షణాలు లేకపోయినా మృత్యువాత...!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ మరింత భయంకరమైన రూపు దాలుస్తుందని అమెరికా వైద్యులు పేర్కొంటున్నారు. యువతలో ఎటువంటి కరోనా క్షణాలు లేకపోయినా వారు హఠాత్తుగా కరోనా,స్ట్రోక్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని వాషింగ్టన్పోస్ట్.కామ్ పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా, 30 నుండి 49 సంవత్సరాల వయస్సు గల చాలా మంది ఆకస్మికంగా మరణిస్తున్నారని అమెరికా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారిలో ఎటువంటి అనారోగ్య, కరోనా లక్షణాలు కన్పించడం లేదని, కానీ ఆకస్మికంగా స్ట్రోక్స్ వల్ల వారు చనిపోతున్నారని న్యూయార్క్‌లో ఒక ఇంటిలో చాలా మంది ఇలా మరణించారని వారు పేర్కొన్నారు. మాన్హాటన్లోని ఎంఎస్‌బీఐ హాస్పిటల్ వైద్యుడు ‘థామస్ ఆక్ల్సీ’ తన రోగులలో ఒకరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఇతర వ్యక్తుల వలే ఆయన లాక్డౌన్లో ఇంట్లో ఉన్నాడని, ఆకస్మాత్తుగా అతను మాట్లాడడానికి ఇబ్బంది పడి మరణించారని చెప్పారు. తరువాత దర్యాప్తులో అతను కరోనా స్ట్రోక్స్ బాధితుడని, అతను కరోనా బారిన పడ్డారని చెప్పారు. ఆ రోగి వయస్సు కేవలం 44 సంవత్సరాలని, హఠాత్తుగా ‘కరోనా’ వల్ల అతని మరణించారని, సహజంగా 74 సంవత్సరా వారు ఇలా మరణిస్తున్నారని, కానీ యువకులు కూడా ఇలా హఠాత్తుగా మృతి చెందుతుండడం ‘కరోనా’ ఎంత భయంకరంగా చెలరేగిపోతుందో తెలుసుకోవచ్చన్నారు.
కాగా యువకుల తలల్లో హఠాత్తుగా స్ట్రోక్స్ వస్తున్నాయని, రోగి తల నుండి గడ్డను తొలగించే ప్రక్రియ ప్రారంభించినప్పుడు, అదే సమయంలో కొత్త గడ్డ రూపొందడం మానిటర్లో చూశానని ఆ వైద్యుడు పేర్కొన్నారు. అమెరికాలో ఇలా అనేక ఆసుపత్రులలో స్ట్రోక్స్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని, ఇలా స్ట్రోక్స్‌కు గురైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయని, కానీ పెరుగుతున్న రోగుల సంఖ్య మరియు అనేక అధ్యయనాలు ‘కరోనా’ శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుందని తేలిందన్నారు. స్ట్రోక్స్ సమయంలో ఆకస్మిక రక్త సరఫరా ప్రభావితం అవుతుందని, ఇది వైద్యులకు క్లిష్టమైన సమస్యగా ఉందని, గుండె సమస్య, కొలెస్ట్రాల్, మందులు తీసుకోవడం మొదలైనవి దీనికి కారణం కావచ్చు. మినీ స్ట్రోకులు సాధారణంగా సొంతంగా నయం అవుతాయి. పెద్ద స్ట్రోకులు ప్రాణాంతకం కావచ్చు మరియు కరోనా వైరస్ కారణంగా రోగులు తీవ్రమైన స్ట్రోక్‌ను ఎదుర్కొంటున్నారు.