WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోహ్లీ' అత్యుత్తమ అథ్లెట్‌...!

ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్‌ కావడానికి 'కోహ్లీ' సంసిద్ధమయ్యాడని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ శంకర్‌ బసూ వెల్లడించారు. ప్రస్తుతం అసాధారణ ఫామ్‌లో ఉన్న కోహ్లీ తన ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు పనిలో నిమగ్నమయ్యారు. 'ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్‌ అనిపించుకునేందుకు విరాట్‌ సిద్ధమయ్యాడు. ప్రత్యేకంగా అతని బలాన్ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే ఫోర్లు, సిక్సర్లను అవలీలగా కొడుతున్నా, ఫిట్‌ నెస్‌ పరంగా మరింత దృఢంగా ఉండాలనేది కోహ్లి కోరిక. అందుకోసం కోహ్లి సంసిద్ధమయ్యాడు. ఇప్పటికే అతని ముందు అనేక మంది రోల్‌ మోడల్స్‌ ఉన్నా, పోటీ నుంచి పారిపోయే తత్వం కోహ్లిది కాదు. పోటీ తత్వంలో ఎప్పుడూ ముందుండే కోహ్లి ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నాడు. చాలా మంది ఆటగాళ్లు ఫలానా కోచ్‌ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతారు. దానికి భిన్నంగా నేను మీకు ఒక విషయం చెబుతున్నా. విరాట్‌ కోహ్లి ఒక అద్వితీయమైన వ్యక్తి. అతనితో కలిసి పని చేయడం నా అదృష్టం అని శంకర్‌ అన్నారు.

(188)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ