WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విద్యార్థుల్లో సెక్స్‌పై అవగాహన ఎక్కువే...!

అమెరికా విద్యార్థుల్లో శృంగారంపై అవగాహన ఎక్కువే ఉందని ప్రభుత్వ సర్వే తేల్చి చెప్పింది. వీరు తాము ఏం చేస్తున్నారో..ఏం చేస్తే ఎలాంటి రోగాలు వస్తాయో..వీరికి బాగానే అవగాహన ఉందట. సర్వేలో పాల్గొన్న వారిలో తాము 13ఏళ్లలోపే శృంగార అనుభవం పొందినట్లు తెలిపారు. అంతే కాకుండా తక్కువలో తక్కువ నలుగురైదుగురితో సెక్స్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. తాజా సర్వే ప్రకారం గతంలో 47శాతం మంది తాము ఇప్పటి వరకూ శృంగారంలో పాల్గొనలేదని చెప్పగా ఇప్పుడా సంఖ్య 41కి తగ్గిందట. దీనికి కారణం సెక్స్‌లో పాల్గొంటున్నవారికి అవాంఛిత గర్భం, వ్యాధులు పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండడమేనట. గతంలో పోలిస్తే శృంగారంలో పాల్గొనే వారి సంఖ్య పెరిగినా వారు తగు జాగ్రత్తలు తీసుకునే ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారట. సెంటర్స్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో 125 ప్రభుత్వ పాఠశాలకు చెందిన 16వేల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను చెప్పారు.

(320)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ