WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గే' క్లబ్‌ కాల్పుల వెనుక మతీన్‌ భార్య హస్తం...!

గే క్లబ్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఒమర్‌ విషయంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ దాడి సంగతి ఒమర్‌ మతీన్‌ భార్య నూర్‌ మతీన్‌కు ముందే తెలుసట. దాడి గురించి ఆమెకు ముందే తెలిసి ఉంటుందని అమెరికా లా ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ విభాగం చెబుతోంది. ఎందుకంటే ఒమర్‌ మతీన్‌ దాడులకు పాల్పడిన గే క్లబ్బుకు ఆమె స్వయంగా పలుమార్లు తీసుకొని వెళ్లిందంట. అంతేకాదు.. ఈదాడికి వారం ముందు ఆమె పలు చోట్లకు అతడితోపాటు వెళ్లిందని, అలా ఇద్దరు వెళ్లిన సమయంలోనే దాడికి కావాల్సిన ఆయుధాలను మతీన్‌ సమర్చుకూర్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమెకు ఈ దాడి గురించి ఆమెకు తెలుసన్న కారణాలతో ఒమర్‌ భార్య అయిన నూర్‌ మతీన్‌ను త్వరలోనే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఓర్లాండోలోని ఓ గేల నైట్‌ క్లబ్బుపై ఒమర్‌ దాడికి పాల్పడి 49మందిని దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరో 50మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి చరిత్రగా మిగిలిపోయింది. కాగా, ఒమర్‌ కు బయటనుంచి ఆదేశాలు రాలేదని, తానే ఉగ్రవాద భావజాల ప్రేరేపితుడై ఈ దారుణానికి దిగాడని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా చెప్పారు. అయితే, ఇంతపెద్ద దాడి వెనుక భారీ కుట్రే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఇప్పుడు కూపీలాగే క్రమంలో అతడి భార్యను అదుపులోకి తీసుకోనున్నారు.

(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ