WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్రగడ'కు 13 ప్రశ్నలు...!

శ్రీ శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి,
ముందుగా మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు ఇంకా నాదేశం, నా వాళ్ళు ఏ ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నారో చూపినందుకు....కానీ మీ ఆటలు ఎక్కువకాలం సాగవులెండి.. కులాల రొచ్చుతో రాష్ట్రాన్ని కడిగిపారేసారు, ఒక మూర్ఖుడు ప్రాంతీయవాదంతో అల్లకల్లోలం చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే, ఆగాయం ఇంకా పచ్చిపచ్చిగా మనసుల్ని సలుపుతుంటే, మళ్ళీ కులాల కంప తెచ్చి మొత్తం కెలికిపారేసారు.
మీ గుండెలపై చెయ్యి వేసుకుని కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి సార్‌...
1. జాతి అంటే ఏంటి కులం అంటే ఏంటి? కాపుకులం, కాపు జాతి ఎలా అయ్యింది?
2. సమస్యలు కేవలం కాపులకే ఉన్నాయా? ఇంకెవరికీ లేవా?
3. మీరు తినే తిండి, కట్టే బట్ట, నడిచే దారి మన కులం వాడు చేస్తేనే వాడుకుందామా ? లేకపోతే పస్తుల్తో చచ్చిపోదామా,నగ్నంగా ఊరేగుదామా, నాజాతి స్మశాన వేదికలో పిశాచాలై నర్తిద్దామా? ప్రస్తుతానికి వస్తే, సరే కాపులకి సమస్యలు ఉన్నాయి ఒప్పుకుందాం(?) మీరు కూడా వారికోసమే పోరాడుతున్నారు(?)
4 . మరి ఆపోరాటం దివంగత వైఎస్‌ఆర్‌ మరియు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏమయింది?
5. ఒకపక్క ప్రభుత్వం స్ధిరపడలేదు. ఉద్యోగులు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ సిగ్గు లేకుండా ఇంకా హైదరాబాదుకి బానిసలై బాన్చన్‌ దొర అనుకుంటూ బతికేస్తున్నారు, హోదాకి గతిలేదు, ప్యాకేజీ పత్తాలేదు, చేతిలో చిల్లుగవ్వలేదు, ఇటువంటి దుర్బరమైన స్ధితిలో వీలైతే సాయంచేయాల్సిందిపోయి ఇలా ఇరుకున పెట్టడం, విద్వేషాలు రగల్చడం, అత్యాచారం చేయడం కంటే ఘోరం, హత్యచేయడం కంటే నేరం, కాదంటారా?
6. లక్షల్లో వచ్చిన వారిని సమన్వయం చేయలేకపోవడం ముమ్మాటికీ మీ చేతకానతనం, కాదంటారా?
7.సభకి వచ్చిన వారిని రెచ్చగట్టడం కుట్రలో భాగం కాదని నిరూపించగలరా?
8. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నేరం కాదంటారా?
9. వాళ్ళని అరెస్ట్‌ చెయ్యకుండా సన్మనాలు చెయ్యాలా?
10. ఆరోజు జరిగిన విధ్వంసంలో ఎవరికైనా ఏమైనా జరిగితే, వారిలో మనవాళ్ళు ఉంటే ఏంటి పరిస్ధితి? మీ ఇంట్లో చిన్న పాప ఏడిస్తేనే కావలసిందేంటో కనుక్కుని అవసరం తీరుస్తారుగా, మరి ఆరోజు చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం బాలేని వారు, ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెట్టి ఉంటారు, వాళ్ళు మనుషులు కారా? అసలు మానవత్వం ఉందా మీకు? దానికి కారణమైన వాళ్ళని వదిలెయ్యమని మళ్ళీ దీక్ష చేస్తునారు, సిగ్గుందా మీకు?
11. నిజమే ఆనాడు జరిగిన విధ్వంసం రాయలసీమ రౌడీల పనే అని ప్రభుత్వం విమర్శించింది, అంతమాత్రాన అసలైనవాళ్ళు దొరికినా వదిలెయ్యమనడం అదేం లాజిక్‌ అసలు?
12. సరే ఉద్యమం చేస్తున్నారు, కానీ సరైన ఉద్యమ కార్యాచరణ ఏది? కార్యాచరణేలేనిదానిని స్వార్ధపూరిత ప్రేరేపణగా ఎందుకు నిర్వచించకూడదు? ఇంట్లో కూర్చుని కంచాన్ని బాదడం కాదు సార్‌, రోడ్డు మీద ఎందరో ఆకలితో మూడిపోతతున్నారు. వాళ్ళు మనుషులు కాదా ? కులాన్ని కాదు వీలైతే వాళ్ళని ఉద్దరించండి,. స్వార్ధంతో యాగం చేసినవాడు శిభి చక్రవర్తి అయినా నేలలోకి తొక్కేసిన ధర్మం సార్‌ మనది. మర్చిపోతే ఎలా?
లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌
13. ఎందుకు సార్‌ మమ్మల్ని మనుషుల నుండి జాతి పేరుతో దూరం చేసేశారు?
సరే సార్‌ జరిగిందేదో జరిగింది..కానీ రిజర్వేషన్లు ఎందుకు అనవసరంగా, ఏకంగా ప్రత్యేక దేశం అడగండి , హాయిగా ఏ దీవులకో కాపుస్ధాన్‌ అనో కాపు దేశం అనో పేరు పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇంత జరిగాకా వీళ్ళతో కలసి బ్రతకడం కష్టంగా ఉంటుంది. నిన్నటిదాకా కలసి బతికిన స్నేహితుల భుజాలపై చేతులెయ్యాలంటే సిగ్గుగా ఉంది సార్‌, వాళ్ళ కళ్ళల్లోకి చూడాలంటే బెరుకుగా ఉంటుంది. తప్పు చెయ్యకుండానే తలొంచుకునే పరిస్ధితికి వచ్చేసాం సార్‌. ఇంకెందుకు ఇక్కడ, మనదేశం పోదాం, వర్గానికో రాష్ట్రాన్ని చేసి మన పల్లకీల్లో మనమే కూర్చుందా, లాగేవాడితో మనకేంటి పని..
మన దేవుణ్ణి మనమే సృష్టించుకుందాం , వీధికో గుడి వెలుస్తున్న ఈరోజుల్లో దేవుణ్ణి సృష్టించడం ఎంతసేపు రాయి చెక్కితే రూపం, బొట్టుపెట్టి చేతులు జోడిస్తే దేవుడు. ఇహ కాపు గీత రాసే పని కాపునాడుకి అప్పగిద్దాం, కాపు పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు రాసేపనిని సాక్షి వారికి అప్పగిద్దాం,(వారిది మన జాతి(?) కాకున్నా కట్టు కధలు అల్లడంలో వారు దిట్టలు కనుక) అందుకనే దేశాన్ని అడగండి మనం పోదాం, మనం పోతే మిగిలిన వారు మాత్రం ఎందుకుండిపోవాలిక్కడ,
అందుకే నా మిగతా జాతి(?) సోదరులారా మీరూ గోంతు పెగల్చండి, తగలబెట్టండి, కులాధారిత దేశ సాధనకి నడుంకట్టండి%లల
మనం బతికితే చాలు పక్కోడి బాగు మనకెందుకు, అందుకే ఉద్యమిద్దాం. ''కాదు నాది భారతదేశం, నేను భారతీయున్ని, నాదేశ సమగ్రతే నాకు ముఖ్యం'' అనుకుంటే నిలదయ్యండి ముద్రగడ పద్మనాభం మరిము వెనకుడి చిచ్చు రాజేస్తున్న రాజీకీయ శకునుల్ని... జాతి వైరాలతో, కులం కొట్లాటలతో పబ్బం గడుపుకోవాలనుకునే సన్నాసులకి బుద్ది వచ్చే వరకూ ప్రశ్నంచండి. ఇటువంటి నికృష్టుల చేతిలో రాష్టృం నాశనం కాకుండా కాపాడుకుందాం.
మనుషులుగా బ్రతుకుదాం, మానవ సంబంధాలతో బతుకుదాం.

(210956)
  • (1)
  • -
  • (2)

image
laxman addala : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోషల్ మీడియాలో ఓ యువకుడు అడిగిన 13 ప్రశ్నలు –వాటికి నెటిజెన్ల (కాపు నాయకులు లేదా కాపు అభిమానులు) సమాధానాలు :ఒక సన్నాసి (సోషల్ నెట్ వర్క్ లో ఓ యువకుడు), మా జాతి సింహం ముద్రగడ వారికి సంధించిన 13 ప్రశ్నలకు మా కాపు జాతి పులులు ఇచ్చిన 13 సమాధానాలు:

1.జాతి అంటే ఏంటి కులం అంటే ఏంటి? కాపుకులం, కాపు జాతి ఎలా అయ్యింది?సమాధానం: మాకు తెలిసి మానవజాతి, వృక్ష జాతి,జంతుజాతి ఇలా పేర్లు ఉన్నాయి. సైన్స్ ఏమి చెప్పిదంటే మానవులందరికీ మైటోకాండ్రియా ఒక్కటేనని అంటే తల్లి ఒక్కటేనని తండ్రులు మాత్రమే వేరని చెప్పింది. సరే ఇది బాగానే ఉంది. మనమంతా భారతీయులం మనది భారత జాతి అన్నారు. ఆర్యులు, ద్రవిడులు ఇలా భేదాలు ఉన్నా సరే అలాగే అన్నాం. ఆ తర్వాత భారత జాతిలోనే విభేదాలు తెస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలుగు జాతి ఆత్మగౌరవం అన్నారు. నాకు తెలిసినంత వరకు తెలుగు ఒక భాష మాత్రమే దాన్ని జాతిని చేశారు. సర్లే అని ఊరుకున్నాం. అదే ఓటు బ్యాంకు రాజకీయాలతో తెలుగు తల్లి మాకు అన్యాయం చేసింది మాది తెలంగాణ జాతి అన్నారు. తెలంగాణ ఒక ప్రాంతంగానే నాకు తెలుసు ఎందుకంటే భిన్నమతాల సమాహారం. అది కూడా ఒక జాతి అయ్యింది. మరి భాష అయిన తెలుగు, ప్రాంతమైన తెలంగాణ జాతిగా మారినప్పుడు కులం అయిన కాపు జాతిగా మారడంలో అసలేమాత్రం తప్పులేదు. ఎవరి గుండెల మీద వాడు చెయ్యి వేసుకుంటే వాడి తప్పు వాడికే అర్థం అవుతుంది.2. సమస్యలు కేవలం కాపులకే ఉన్నాయా? ఇంకెవరికీ లేవా?సమాధానం: సమస్యలు అందరికీ ఉంటాయి. ఎవరి సమస్యను వాడే పరిష్కరించుకోవాలి. కాపులు ఇప్పుడు చేస్తున్నది అదే. వాళ్లకి రిజర్వేషన్ల సమస్య ఉంది. అందుకే పోరాడుతున్నారు. పోరాడితే పోయేదేమి ఉంది ఓటమి తప్ప. గుజరాత్లో పటేళ్లు అలా పోరాడబట్టే కనీసం EBCలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. మేము అధికారంలోకి వస్తే దాన్ని 20 శాతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. జాట్లు కూడా పోరాడబట్టే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వస్తోంది. అడగనిదే అమ్మ అయినా పెట్టదు అంటారు. కాపుల సమస్యలపై కాపులు పోరాడకపోతే మీరు పోరాడతారా. ఆంధ్రప్రదేశ్లో కాపులు 25 నుంచి 30 శాతం ఉంటే ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా. సరే కేంద్రమంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు ఇలా ఎలా చూసినా జనాభాకు తగ్గట్లు అసలు ప్రాతినిధ్యం దక్కడం లేదు. అదే కమ్మ, రెడ్డి కులాలకైతే వారు 5 శాతానికి మించి లేకపోయినా ఐదు రెట్ల పదవులు అనుభవిస్తున్నారు. ఇక కాపుల్లో కడు పేదరికం అనుభవిస్తున్నవారు లక్షలాదిగా ఉన్నారు. వారికి దిక్కెవరు. బీసీల పేరు చెప్పుకుని మూడు, నాలుగు కులాలే రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నాయి కదా ?. జనాభా ప్రాతిపదికన కాపులు వారి వాటా వారు అడిగితే అది జాతీయ సమస్య అంటే ఎలా? మాకేమీ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల దేవాలయాలలో 15 లక్షల పూజారుల పదవులు రిజర్వ్డ్గా లేవే. పోనీ హిందూ మతంలో మాకు అగ్రవర్ణ హోదా ఉందా అంటే అదీ లేదు శూద్రులనే అన్నారు. మరి ఏ కారణంతో మాకు గతంలో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తారు. మేము ఏదీ పక్కొడిది అడగడం లేదు మాది మాకు ఇవ్వమంటున్నాం.3. మీరు తినే తిండి, కట్టే బట్ట, నడిచే దారి మన కులం వాడు చేస్తేనే వాడుకుందామా ? లేకపోతే పస్తుల్తో చచ్చిపోదామా,నగ్నంగా ఊరేగుదామా, నాజాతి స్మశాన వేదికలో పిశాచాలై నర్తిద్దామా?సమాధానం:ఇంతకంటే చెత్త ప్రశ్న మరొకటి ఉండదు. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారంతా తినే తిండి, కట్టే బట్ట, నడిచే దారి వారి కులం వాళ్లు చేస్తేనే వాడుకుంటున్నారా? ప్రపంచీకరణ జరుగుతున్నప్పుడు అది సాధ్యమా?రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు అలా చేస్తే చెప్పండి అప్పుడు అలానే చేసేద్దాం.4 . మరి ఆపోరాటం దివంగత YSRమరియు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమయింది?సమాధానం:మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ఎవరు? చంద్రబాబే కదా? కాపు కమీషన్ వేసి వెయ్యి కోట్ల నిధులు ఇస్తాము అన్నది ఎవరు? రాజశేఖర్ రెడ్డి కాదు కదా చంద్రబాబే కదా? మరి ముద్రగడ దీక్షకు కూర్చునే వరకు చంద్రబాబు రిజర్వేషన్ల కోసం కమీషనే వెయ్యలేదు సరికదా కాపు కార్పోరేషన్కు వందకోట్లు ఇచ్చి ఊరుకున్నావు? మరి నువ్వు ఆల్ ఫ్రీ హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్రం విడిపోయే ఉంది కదా మరి ఎందుకిచ్చావు. 2009, 2004, 1999 అంతకంటే ముందు ఈ హామీలు ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం కలసి ఉంది. తెలంగాణలో బీసీ జనాభా 70 శాతం ఉంది. వారికి ఎక్కడ చెడ్డ అయిపోతావోనని, ఆ ఓట్లు ఎక్కడపోతాయోనని ఆ హామీలు ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయే సరికి ఆంధ్రప్రదేశ్లో బీసీల కంటే అగ్రవర్ణాల జనాభానే ఎక్కువగా ఉంది. అందులోనూ దాదాపు 25 శాతానికి పైగా జనాభాతో కాపులు నిర్ణయాత్మక శక్తిగా మారారు. అందుకే ఓట్ల కోసం కాపులను బీసీల్లోకి చేరుస్తామని మాట ఇచ్చావు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీ ఓటు బ్యాంకు చూసి కాపు రిజర్వేషన్లపై ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. 50 శాతానికి పైగా ఓసీలు ఉన్నారు. అందుకే కాపులు ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం పట్టుబడుతున్నారు. అంబేడ్కర్ 10 ఏళ్లు పెట్టిన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇంకో వందేళ్లు అయినా ఎలా కొనసాగిస్తారో....అదే ఓటు బలంతో కాపులు తమ హక్కును కోరితే తప్పేంటి?5,6 . ఒకపక్క ప్రభుత్వం స్ధిరపడలేదు. ఉద్యోగులు ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ సిగ్గు లేకుండా ఇంకా హైదరాబాదుకి బానిసలై బాన్చన్ దొర అనుకుంటూ బతికేస్తున్నారు, హోదాకి గతిలేదు,ప్యాకేజీ పత్తాలేదు, చేతిలో చిల్లుగవ్వలేదు, ఇటువంటి దుర్బరమైన స్ధితిలో వీలైతే సాయంచేయాల్సిందిపోయి ఇలా ఇరుకున పెట్టడం, విద్వేషాలు రగల్చడం, అత్యాచారం చేయడం కంటే ఘోరం, హత్యచేయడం కంటే నేరం, కాదంటారా?జవాబు: చేతిలో చిల్లుగవ్వ లేదు అంటారు. ఏదో ధనిక రాష్ట్రంలా ఉద్యోగులకు తెలంగాణతో సమానంగా జీతాలు పెంచారు. డబ్బులు లేవు రాజధాని నిర్మాణం కోసం ఇటుకలు ఇవ్వండి అంటారు. వాస్తు పిచ్చితో హైదరాబాద్లో ఉండని క్యాంపు ఆఫీసు కోసం 100 కోట్లు వృధా చేశారు. ఓటుకు నోటు కుంభకోణం బయటపడటంతో భండారం ఎక్కడ బట్టబయలు అవుతుందోననే భయంతో హుటాహుటిన అమరావతి బాటపట్టారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం అని ఇంకా అబద్దాలు చెబుతూ రాయలసీమ కోసం 2 వేల కోట్లతో పట్టిసీమ కట్టామన్నారు. ఒక్క చుక్క అయినా సీమకు నీరు వెళ్లిందే. వెళ్లదు. మరి ప్రభుత్వం చెప్పినట్లు మూడేళ్లలో పోలవరం పూర్తయితే పట్టిసీమకు పోసిన 2 వేల కోట్లు వృథా కాదా. రాయలసీమకు నీళ్లు వెళ్లవుగాక వెళ్లవు ఎందుకంటే అందుకు కాల్వలేమీ. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తేనే అవి సీమకు వెళ్తాయి. అలా చేయాలంటే తెలంగాణ సహకరించాలి కదా. మరి మూడేళ్ల కోసం 2 వేల కోట్లు వృథా చేసి చేతిలో చిల్లి గవ్వ లేదు అంటే ఎలా నమ్ముతారు.

హోదాకి గతి లేదు,ప్యాకేజికి పత్తా లేదు అంటారు. మరి కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉండి ఏమి చేస్తోంది. పోరాడాలి కదా. కేంద్రంలో తగవులు పెట్టుకుంటే అసలు పనులే కావు అని సాకులు చెబుతారు. మరి అలాంటప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెడితే ఎందుకు ప్రజలు గెలిపించారు. మరి అప్పుడు కేంద్రంతో తగవు పెట్టుకున్నట్లు కాదా? బిహార్లో నితీశ్కుమార్,బెంగాల్లో మమతాబెనర్జీ,తమిళనాడులో జయలలిత వీళ్లంతా భాజపాతో పోటీ చేసి గెలవలేదా. కేంద్రంతో తగవు పెట్టుకోకూడదు అంటే ప్రాంతీయ పార్టీలే ఉండకూడదు. తెలంగాణ ఉద్యమం చూడలేదా? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వొంచి వారు సాధించుకోలేదా?. ఓటుకు నోటు కుంభకోణంలో చంద్రబాబు ఇరుక్కుని కేంద్రం సాయం కోరి....రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు. ధనిక రాష్ట్రంలా నీ ఆల్ఫ్రీ హామీలు,నీ ఆడంబరాలు కారణంగా కేంద్రం కూడా ఇచ్చే ఆ కాస్త నిధులు కూడా ఇవ్వడం మానేసింది. ఇక విద్వేషాలు ఎవరు రగిల్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చమన్నారు అంతే. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల రాష్ట్రానికి జరిగే ఆర్థిక నష్టం ఏమిటో చంద్రబాబే చెప్పాలి? మోదీలా ప్రత్యేక హోదా హామీ ఇచ్చి తప్పించుకుని తిరిగితే కుదరదు.7.సభకి వచ్చిన వారిని రెచ్చగట్టడం కుట్రలో భాగం కాదని నిరూపించగలరా?

సమాధానం: రైలు రోకో, రాస్తారోకో చేద్దామంటే రెచ్చగొట్టడమా?తెలంగాణ, సమైక్య ఆంధ్ర ఉద్యమాల్లో ఇలాంటివి ఎన్ని జరగలేదు. పటేళ్లు, జాట్లు చేసిన ఉద్యమాల్లో హింసతో పోలిస్తే ఇదీ ఒక హింసేనా. లక్షలాదిగా వీధినపడితే ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరుగుతాయి. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చూస్తే ఇలాంటివి ఎన్నో తారసపడతాయి. ఉత్తుత్తి హామీలు ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఆ తప్పు ముమ్మాటికీ ప్రభుత్వానిదే.8. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం నేరం కాదంటారా?నేరమే. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సమైక్య ఆంధ్ర, తెలంగాణ ఇలా ఏ ఉద్యమం చూసుకున్నా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సర్వసాధారణం, ఎందుకంటే ఉద్యమం చేస్తున్నదే ప్రభుత్వంపై కాబట్టి ఆ కోపం ప్రభుత్వ ఆస్తులపై చూపిస్తారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే....ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.

9. వాళ్ళని అరెస్ట్ చెయ్యకుండా సన్మానాలు చెయ్యాలా?సమాధానం: ప్రభుత్వం మనవైపు ఉంటే ఒకలా, లేకుంటే మరోలా పరిస్థితి ఉంటుంది అన్నది వాస్తవం. ఉదాహరణకు బాలకృష్ణ కాల్పుల కేసు, ఓటుకు నోటు కేసు,సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల కేసులు మాదిరిగా...ఆ ఉద్యమాల్లో హింసకు పాల్పడిన వారంతా ఇప్పుడు దర్జాగా మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. అదే ప్రభుత్వం మనవైపు లేకపోతే....కనిపించిన వారిని బొక్కలో వేసి నానా కేసులు బనాయిస్తారు. ముద్రగడ విషయంలో జరుగుతున్నది అనే....పులివెందుల నుంచి వచ్చారు అన్నారు మరి తూగో, పగో వాళ్లను ఎందుకు అరెస్టు చేశారు. ప్రభుత్వం అరెస్టు చేసింది కాబట్టి వారు దోషులు అని మేము నమ్మాలా? ఎవరికి పెడతారు పువ్వులు. మరి డైరెక్టుగా దొరికిన బాలకృష్ణ కాల్పుల కేసు, ఓటుకు నోటు కేసు, సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల్లో ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేసిన విధ్వంసం అంతా ఎక్కడికి పోయింది.10. ఆరోజు జరిగిన విధ్వంసంలో ఎవరికైనా ఏమైనా జరిగితే, వారిలో మనవాళ్ళు ఉంటే ఏంటి పరిస్ధితి?మీ ఇంట్లో చిన్న పాప ఏడిస్తేనే కావలసిందేంటో కనుక్కుని అవసరం తీరుస్తారుగా, మరి ఆరోజు చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం బాలేని వారు, ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెట్టి ఉంటారు, వాళ్ళు మనుషులు కారా?

అసలు మానవత్వం ఉందా మీకు?దానికి కారణమైన వాళ్ళని వదిలెయ్యమని మళ్ళీ దీక్ష చేస్తునారు, సిగ్గుందా మీకు?సమాధానం:ఎక్కడైనా ఉద్యమాలు జరిగితే ఇబ్బందిపడింది ప్రజలే. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైలు ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారు. అవి అన్నీ మర్చిపోయారా?ఈ రెండు ఉద్యమాల సమయంలో తప్పు చేసిన వారు ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులుగా ఉన్నారే. మరిని వారిని ఏమీ చేయరా....వారిని వదిలేస్తే వీళ్లను వదిలేయమంటారు.11. నిజమే ఆనాడు జరిగిన విధ్వంసం రాయలసీమ రౌడీల పనే అని ప్రభుత్వం విమర్శించింది,అంతమాత్రాన అసలైనవాళ్ళు దొరికినా వదిలెయ్యమనడం అదేం లాజిక్ అసలు?జవాబు:వడ్డించే వాడు మనవాడయితే అనే సామెత దీనికి వర్తిస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంటే అది బాలకృష్ణ కాల్పుల కేసు,ఓటుకు నోటు కేసు అవుతుంది లేకపోతే ముద్రగడ కేసు అవుతుంది. కాపు అన్నవాడు కనిపిస్తే బొక్కలో పెట్టమని కొన్ని పేపర్లలో హెడ్డింగ్లతో వచ్చాయి. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఎవరినైనా జైల్లో వేయవచ్చు.12. సరే ఉద్యమం చేస్తున్నారు, కానీ సరైన ఉద్యమ కార్యాచరణ ఏది?కార్యాచరణేలేనిదానిని స్వార్ధపూరిత ప్రేరేపణగా ఎందుకు నిర్వచించకూడదు? ఇంట్లో కూర్చుని కంచాన్ని బాదడం కాదు సార్, రోడ్డు మీద ఎందరో ఆకలితో మూడిపోతతున్నారు. వాళ్ళు మనుషులు కాదా ? కులాన్ని కాదు వీలైతే వాళ్ళని ఉద్దరించండి,.స్వార్ధంతో యాగం చేసినవాడు శిబి చక్రవర్తి అయినా నేలలోకి తొక్కేసిన ధర్మం సార్ మనది.మర్చిపోతే ఎలా?సమాధానం: కమీషన్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఫలితం లేకపోతే అప్పుడు ఉద్యమ కార్యాచరణ ఎలానూ ఉంటుంది తొందరపడవద్దు సుందరవదనా. కాపు కులంలో ఉన్న లక్షలాది పేదల కోసం ముద్రగడ పోరాడటంతో తప్పేమి ఉంది. రోడ్డు మీద ఎందరో ఆకలితో మాడిపోతున్నారా మరి ప్రభుత్వం ఏమి చేస్తోంది. అంత చేతకాని ప్రభుత్వమా ఇది. ఏంటి వాళ్లు మనుషులు కాదా? మరి రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారే మనుషులా. కూలాన్ని కాదు వాళ్లను ఉద్దరించాలా. మరి రాజకీయనాయకులు ఏమి పీకుతున్నట్లో. ఈ కలికాలంలో స్వార్థం లేకుండా ఎవరు ఏ పని చేయడు. ఓట్లు పడతాయనే స్వార్థంతోనే చంద్రబాబు హామీలు ఇచ్చాడు. ప్రతి ఒక్కడూ ప్రతిఫలాన్నిఆశించిన వాడే. ఓట్లు పడతాయనే ఉద్దేశంతోనే అంబేడ్కర్ 10 ఏళ్లు పెట్టిన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

13. ఎందుకు సార్ మమ్మల్ని మనుషుల నుండి జాతి పేరుతో దూరం చేసేశారు? సరే సార్ జరిగిందేదో జరిగింది. కానీ రిజర్వేషన్లు ఎందుకు అనవసరంగా,ఏకంగా ప్రత్యేక దేశం అడగండి ,హాయిగా ఏ దీవులకో కాపుస్ధాన్ అనో కాపు దేశం అనో పేరు పెట్టుకుని వెళ్ళిపోదాం.సమాధానం: ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారంతా ప్రత్యేక దేశాల్లో ఉంటే అలానే చేద్దాం. రిజర్వేషన్లు ఉన్న వారికి కూలానికో దేశం పెట్టండి. అప్పుడు కాపులకూ పెట్టుకుందాం.


Monday, Jun, 2016    08:13 PM

అభిప్రాయాలూ