లేటెస్ట్

జర్నలిస్టుల‌ను ఆదుకోవాల‌ని హైకోర్టులో పిల్‌...!

‘కరోనా’పై ప్రత్యక్ష పోరాటం చేస్తోన్న జర్నలిస్టుల‌ను ప్రభుత్వం ఆదుకోవాలంటూ తెలంగాణ హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్‌ పిల్‌ దాఖలు చేశారు. ప్రాణాల‌కు తెగించిన ‘కరోనా’ వార్తల‌ను కవర్‌ చేస్తోన్న జర్నలిస్టుల‌కు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాల‌ని ఆయన కోర్టును అభ్యర్థించారు. లాక్‌డౌన్‌ సమయంలో జర్నలిస్టులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల‌కు రూ.25వేల‌ను ప్రభుత్వం నుంచి ఇప్పించాల‌ని ఆయన కోర్టును కోరారు. అదే విధంగా కరోనా వార్తల‌ను కవర్‌ చేస్తోన్న జర్నలిస్టుల‌కు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాల‌ని, జర్నలిస్టుల‌కు మెడికల్‌ కిట్లు, మాస్కులు ఉచితంగా అందించాల‌ని కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ తెంగాణ సమాచారశాఖ కార్యదర్శికి, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాల‌తో కౌంటర్‌ దాఖలు చేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాల‌కు వాయిదా పడింది.

(764)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ