WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జెంటిల్‌మన్ రివ్యూ: హ్యాట్రిక్‌ కొట్టిన 'నాని'...!

'భలే భలే మగాడివొయ్‌, కృష్ణగాడి వీర ప్రేమ గాధ' వంటి రెండు హిట్‌లు సొంతం చేసుకున్న హీరో నాని ఇప్పుడు మరో హిట్‌ ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్‌ కొట్టారు. వినూత్నమైన కథను ఎంచుకునే 'నాని' ఈ సినిమాతో మరోసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు.హీరో,విలన్‌గా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించి 'నాని' విజయాన్ని అందుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. గతంలో 'అష్టాచెమ్మా' ద్వారా విజయవంతమైన కాంబినేషన్‌ మళ్లీ విజయం సాధించింది.
కధ:-
కెథరిన్‌(నివేదా థామస్‌) ఐశ్వర్య(సురభి) ఒక విమాన ప్రయాణంలో కలుసుకుని ఫ్రెండ్స్‌ అవుతారు. అయితే ముందే అనుకున్నట్లు నాని 2 క్యారెక్టర్లు జయ్‌, గౌతం. తమ తమ కధలు చెప్పుకున్న కెథరిన్‌, ఐశ్వర్యలు తమ లవ్‌ మ్యాటర్‌ కూడా పంచుకుంటారు. కెథరిన్‌ ను చూసి ఐటి ఉద్యోగి అయిన గౌతం లవ్లో పడతాడు. పెద్దింటి అమ్మాయి అయిన కెథరిన్‌ మొదట గౌతం లవ్‌ ను తిరస్కరించినా తదుపరి అతని సిన్సియారిటిని చూసి తాను కూడా ప్రేమిస్తుంది. ఇక ఐశ్వర్యను సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ యజమాని అయిన జయ్‌ లవ్‌ చెస్తాడు. వీరి లవ్‌ స్టోరి అలా కొనసాగుతుంటే ఊహించని ట్విస్ట్‌ తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండ్‌ హాఫ్‌ లో ఊహించని పరిణామాల మద్యన నాని లోని విలన్‌ బయటకు వొస్తాడు. ఇంతకు ఆ విలన్‌ గౌతమా లేక జయ్‌ అనేది సినిమా చూడాలి. ఇంతకీ అసలు చనిపోయిన వ్యక్తికి నానికి ఉన్న సంబంధం ఏంటీ? నాని కెథరిన్‌ ను ఐశ్వర్యను 2 ని ఎందుకు మోసం చేయాల్సి ఒచ్చింది? ఎటువంటి పరిస్థితిలో నాని అలా చేయాల్సి ఒచ్చింది? శ్రీముఖి కేరెక్టర్‌ ఏంటీ? ఇలాంటి విషయాలన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్‌:-
సినిమాను కేవలం నాని కోసమే తిసినట్లు సరిగ్గ సరిపోయాడు. ప్రస్తుత తరం హీరోలలో నటన పరంగా తనకు పోటి లేదు అనే సంగతి నాని ఈ చిత్రంతో చాటి చెప్పాడు. ఇక హీరోయిన్‌ నివేదా థామస్‌ ఆ పాత్రకు తానైతేనే సరిపొయేలా నటించింది. ఇక సురభి పాత్రలో కంటే కూడా పాటలలో మరింత అందంగా ఉంది. శ్రీముఖి నటన పర్లేదు. వెన్నెల కిశోర్‌ తన కామెడితో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వారు తమ తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్‌ పర్ఫార్మెన్స్‌:-
టెక్నికల్‌ పర్ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవాలంటే ముందుగా మణిశర్మ గురించి చెప్పాలి. మణిశర్మ తన ముయజిక్‌ తో మ్యాజిక్‌ చేయడమే కాకుండా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ను అద్భుతంగా ఇచ్చి సినిమాకు ప్రాణం పొసాడు. ఇక మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి తన దర్శకత్వ ప్రతిభ మొత్తాన్ని ఫస్ట్‌ హాఫ్‌ లో చూపించి సెంకండ్‌ హాఫ్‌ లో తేలిపోయాడు. హత్యా శోధన వద్దకు వచ్చేసరికి సినిమా లోని విషయాలు ముందే ప్రేక్షకుడు ఊహిస్తాడు. ఇక పి జి విందా సినిమాటోగ్రఫి సినిమాకు మరో సక్సెస్‌ ఫ్యాక్టర్‌. ముఖ్యంగా పాటలలో విందా తన పనితనం చూపించారు.(988)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ