WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

36ఏళ్ల తరువాత ఫైనల్‌కు...!

భారత్‌ హాకీ జట్టు 36ఏళ్ల తరువాత ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో ఓటమితో ఫైనల్‌ అవకాశాలు సందిగ్ధంలో పడినా మళ్లీ ఫైనల్లో అదే జట్టును భారత్‌ ఢీకొంటుండడం గమనారం. తాజాగా జరిగిన చివరి రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌, బెల్జియంలు 3-3తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాయి. దీంతో 7 పాయింట్లతో మెరుగ్గా ఉన్న భారత్‌ ఫైనల్‌ చేరింది.ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-2 తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో భారత్‌ ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. భారత్‌పై విజయంతో ఆస్ట్రేలియా 13 పాయింట్లతో ఫైనల్‌ చేరింది. తాజాగా బెల్జియం- గ్రేట్‌ బ్రిటన్‌ మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో 7 పాయింట్లతో మెరుగ్గా ఉన్న టీమిండియా ఫైనల్‌ చేరేందుకు మార్గం సుగమమైంది.

(193)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ