WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భారత్‌పై జింబాబ్వే విజయం...!

జింబాబ్వే ఆటగాళ్లు చెప్పిందే నిజం అయింది. భారత్‌పై తాము విజయం సాధిస్తామని, భారత్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పిన ఆ జట్టు ఆటగాళ్లు..చివరకు అదే నిజం చేశారు. శనివారం నాడు హరారేలో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్‌పై జింబాబ్వే రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20ఓవర్లలో 170 పరుగులు చేసింది. 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 168పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌ చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా ఆరు పరుగులే వచ్చాయి. ప్రపంచంలోనే అత్యుత్తమైన ఫినిషర్‌ కెప్టెన్‌ ధోనీ క్రీజ్‌లో ఉన్నా ఆయన భారత్‌ను గెలిపించలేకపోయారు. ఇన్సింగ్‌ చివరి ఓవర్‌ మొదటి బంతికి సింగిల్‌ తీసిన ధోని 'పటేల్‌'కు రెండవ బాల్‌ ఎదుర్కొనే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే 'పటేల్‌'ను మాద్విజ్‌ అవుట్‌ చేయడంతో మూడవ బంతికి ధోనీ ఒక పరుగు తీశాడు. మరో మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో 'రిషి' నాల్గవ బంతిని వృధా చేసి ఐదవ బంతికి సింగిల్‌ తీశాడు. దీంతో చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా 'ధోనీ' బంతిని బౌండరీ దాటించలేకపోయాడు. చివరి బంతికి ఒక్క పరుగే రావడంతో 'జింబాబ్వే' రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో కనీసం 150పరుగులు చేయలేకపోయిన జింబాబ్వే ఈ మ్యాచ్‌లో 170 పరుగులు చేసింది.

(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ