WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాబోయే 'ఆర్‌బీఐ' గవర్నర్‌ 'అరుంధతి...?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా తాను మళ్లీ బాధ్యతలు చేపట్టనని ప్రస్తుత గవర్నర్‌ 'రఘురాం రాజన్‌' స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పోస్టులో ఎవరు కూర్చుంటారా అనేది చర్చనీయాంశమైంది. తాజాగా ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏడుగురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ విదేశీ వార్తా సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ అంశం సున్నితమైనందున తన పేరును వెల్లడించవద్దని ఆ సంస్థ పేర్కొంది. ఆ సంస్థ అంచనా ప్రకారం ఈ పదవి కోసం 'విజయ్‌ కేల్కర్‌, రాకేష్‌ మోహన్‌, అశోక్‌ లాహిరి, ఊర్జిత్‌ పటేల్‌, అరుంధతి భట్టాచార్య, సుబీర్‌ గోకర్ణ్‌, అశోక్‌ చావ్లాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. వీరిలో ప్రముఖంగా ఊర్జిత్‌పటేల్‌, అరుంధతీ భట్టాచార్య రేసులో ముందున్నట్లు పేర్కొంది. 'పటేల్‌' ప్రస్తుతం ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ కాగా, అరుంధతి భట్టాచార్య ఎస్‌బిఐ ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. మిగిలినవారంతా గతంలో ఆర్బీఐ, ఇండియన్‌ సివిల్‌ సర్వీసు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి వాటిలో సేవలందించినవారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ అయిన ఎస్‌బిఐ ఛైర్‌పర్సన్‌ 'అరుంధతి' కాబోయే ఆర్‌బిఐ గవర్నర్‌ అని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

(706)
  • (0)
  • -
  • (1)

అభిప్రాయాలూ