WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

యువ ఆటగాని చేతిలో 'ఫెదరర్‌'కు పరాజయం...!

టెన్నిస్‌ దిగ్గజం 'రోజర్‌ ఫెదరర్‌'కు ఊహించని షాక్‌ తగిలింది. ఓ 19ఏళ్ల యువకుడు ఆయనకు షాక్‌ ఇచ్చాడు. 'హాలీ ఓపెన్‌' టోర్నమెంట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫెదరర్‌ జర్మనీ యువ ఆటగాడు అజ్వెరేవ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో అలెగ్జాండర్‌ 7-6(7/4), 5-7, 6-3 తేడాతో ఫెదరర్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తొలి సెట్‌ నుంచి ఫెదరర్‌కు చెమటలు పట్టించిన అలెగ్జాండర్‌ అంచనాలు మించి రాణించాడు. టై బ్రేక్‌ దారి తీసిన తొలి సెట్‌లో నాలుగు పాయింట్లు మాత్రమే కోల్పోయిన అలెంగ్జాడర్‌ ఆ సెట్‌ను దక్కించుకున్నాడు.అనంతరం రెండో సెట్‌లో తిరిగి పుంజుకున్న ఫెదరర్‌ ఆ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఆది నుంచి అలెగ్జాండర్‌ ఆధిక్యం కనబరిచాడు. అనవసర తప్పిదాలకు ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా ఫెదరర్‌ ను వెనక్కునెట్టాడు.

(168)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ