WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజన్‌' కాంగ్రెస్‌ ఏజెంట్‌...!

ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ కాంగ్రెస్‌కు ఏజంట్‌ అని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. రాజన్‌ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్‌డిఏ సర్కారు వచ్చినప్పటి నుంచీ రాజన్‌ నిర్ణయాలన్నీ అనుమానాస్పదమేనవేనన్నారు. రాజన్‌ తన హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థను సర్వనాశనం చేశాడని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ దెబ్బతిన్నాయని స్వామి ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల వారు మరింతగా దెబ్బతిన్నారని స్వామి చెప్పారు. రాజన్‌పై రాహుల్‌ వ్యాఖ్యల తర్వాత తనకు ఆర్బీఐ గవర్నర్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌ అనేది రూఢీ అయిందన్నారు. రాజన్‌కు రెండో సారి అవకాశం ఇవ్వకుండా మోదీ మంచి పని చేశారని స్వామి ప్రశంసించారు. కాగా గతంలో 'సుబ్రహ్మణ్యస్వామి' ఆరోపణలపై కలత చెందిన 'రాజన్‌' తాను రెండోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేయనని నిన్ననే చెప్పాడు. అయినా మరోసారి 'స్వామి' ఆయనపై విమర్శలు గుప్పించడం విశేషం.

(380)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ