WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్రగడ' ఆరోగ్యం ఆందోళన కరం...!

'తుని' విధ్వంసం కేసులో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ గత పదకొండు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తోన్న 'ముద్రగడ' ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినట్లు తెలుస్తోంది. తనను కలిసిన తన బంధువులతో ఆయన నిర్వేదంతో మాట్లాడుతున్నారట. రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఈ దేహానికి వైద్యం ఎందుకు అని ఆయన అన్నట్లు తెలుస్తోంది. తనను వేరే హాస్పటల్‌కు తీసుకు వెళ్లవద్దని, తీసుకువెళ్లాలంటే తన శవాన్నే తీసుకెళ్లాలని ఆయన చెబుతున్నారట. ఆరోగ్య పరీక్షలు, రక్త నమూనాలు ఇవ్వడానికి ఆయన ఈ రోజు కూడా నిరాకరించారు. ఆరోగ్య పరీక్షలు, రక్త నమూనాలు ఇవ్వడానికి కూడా ఆయన నిరాకరించారు. ఆయన వియ్యంకుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ తుని కేసులో అరెస్టు అయిన పదమూడు మందిని విడుదల చేయాలని ముద్రగడ పట్టుదలగా ఉన్నారని, మూడు రోజుల క్రితం ముద్రగడ రక్త శాంపిల్స్‌ ఇచ్చినా, మంత్రులు ఎగతాళి చేయడంతో ఆయన పట్టుదలతో ఉన్నారని అన్నారు.

(1323)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ