WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ట్రంప్‌'పై హత్యాయత్నం...!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సంచలనం చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న 'డోనాల్డ్‌ ట్రంప్‌'పై ఓ బ్రిటన్‌ యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆటోగ్రాఫ్‌ అడిగిన మైఖేల్‌స్టాన్‌ఫోర్డ్‌ అనే 20ఏళ్ల యువకుడు పక్కనే ఉన్న పోలీసు అధికారి నుంచి తుపాకీ లాక్కుని ట్రంప్‌పై కాల్పులు జరపబోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మైఖేల్‌ ప్రయత్నాన్ని అడ్డుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ట్రెజర్‌ ఐలాండ్‌ కాసినో వద్ద ట్రంప్‌ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా తాను ఏడాదిగా ట్రంప్‌ను హత్య చేసేందుకు పథకం వేశానని, ఒకవేళ లాస్‌వెగాస్‌లో విఫలమైతే ఫినిక్స్‌లో జరిగే ట్రంప్‌ ర్యాలీలో చంపేందుకు ప్లాన్‌ చేశానని వెల్లడించాడు. ట్రంప్‌ను హత్యాయత్నం చేస్తే తనను భద్రతా దళాలు చంపుతాయని కూడా తెలుసునని అన్నాడు. మైఖేల్‌ వద్ద యూకే డ్రైవర్‌ లైసెన్స్‌ కూడా ఉంది. దీంతో బ్రిటన్‌ ఎంబసీ సాయంతో మైఖేల్‌ను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ