WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పంచాయితీ బదిలీల్లో జాప్యంలో మర్మమేమిటి?

పంచాయితీరాజ్‌,ఇంజనీరింగ్‌శాఖలో ఆన్‌లైన్‌ విధానంలో జరిగిన బదిలీలకు జోన్‌ల వారీగా అమలు చేసి ఆ జాబితాను ఇంజనీరింగ్‌ చీఫ్‌కు పంపడం జరిగింది. ఆ విధంగా జరిగిన బదిలీలను ఆమోదించిన ఇఎన్‌సి గడువుకు ముందే వెబ్‌సైట్‌లో పెట్టారట. గడువు ముగిసి రెండురోజులైనా ఇంత వరకూ ఉత్తర్వులు ఎవ్వరూ అందుకోలేదట. కారణం అడిగితే పై నుంచి ఆదేశాలు వచ్చాయి..జాబితాలను నిలిపివేశాం అంటున్నారు జిల్లా స్థాయి అధికారులు. జిల్లాల పర్యటనలో ఇఎన్‌సి బిజీబిజీగా ఉన్నారు. బదిలీల ఉత్తర్వులను నిలిపివేయమని చెప్పింది ఎవరు? అన్నది బయటకు పొక్కడం లేదు. ఇఎన్‌సికి ఫోన్‌ చేస్తే జిల్లాలపర్యటనకు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. తాము సిఫారుసు చేసిన ఇంజనీర్లను బదిలీ చేయలేదని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రిపై ధ్వజమెత్తుతున్నారు. తన చేతిలో ఏమీ లేదని, అంతా సిఎం ఆదేశాల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి చెప్పారట. సదరు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రిని నిలదీయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ గతంలో మీ సిఫార్సులతోనే బదిలీలు జరిగాయి కదా..మళ్లీవారిని ఎలా బదిలీ చేస్తాం..అని ప్రశ్నించారట? బదిలీలపై సర్వీసు గడువు లేకుండా ఉంటే ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించుకుని అందినంత వరకు వెనకేసుకోవచ్చని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. గతంలో బదిలీలు ఒక వ్యూహం లేకుండా బదిలీ చేశామని మళ్లీ అదే తప్పు పునరావృతం కాకుండా సిఎం తగు జాగ్రత్తలు తీసుకున్నారని, ఆ నిర్ణయాలకు సంతృప్తి పడాల్సిన అధికారపార్టీ వర్గాలు విమర్శలు చేయడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భవిష్యత్‌లో జరిగే బదిలీలన్నింటికి ప్రస్తుత బదిలీల విధానం అమలు చేస్తే పరిస్థితి కుదటపడుతుందని, లేకుండా ఈ తలనొప్పులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారట.

(201)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ