WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజప్ప'పై కోపం లేదట...!

ముద్రగడ ఆమరణ దీక్ష విరమించకపోవడంతో అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇంఛార్జి మంత్రి హోదాలో గుంటూరు జిల్లాకు వెళ్లలేకపోయానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి చినరాజప్ప వివరణ ఇచ్చినట్లు తెల్సింది. అంతే కాకుండా బదిలీలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సమీక్షించుకోవాలి కానీ, తన ప్రమేయం ఏముంటుందని ఆయన చెప్పారట. నిన్న బదిలీల వ్యవహారంలో మంత్రులు సరిగా వ్యవహరించడంలేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంపై హోం మంత్రి వివరణ ఇస్తూ ఈ విషయం చెప్పారట. ఏ జిల్లాలోనైనా బదిలీలన్నీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విధంగానే జరిగాయే తప్ప అవకతవకలు చోటు చేసుకోలేదని,దీంతో ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందని ఆయన అంటున్నారట. కాగా తనను తనతో పాటు బయటకు వచ్చినవారందరినీ పోలీసు వాహనంలో క్లిరంపూడికి తీసుకెళ్లాలని ముద్రగడ కోరారని, అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఆయన స్వయంగా తరలివెళ్లారని హోంశాఖ అధికారులు చెబుతున్నారు. అటు 'ముద్రగడ' దీక్ష విరమించడంలో కీలకపాత్ర పోషించడంతో..బదిలీల వ్యవహారంలో తనపాత్ర తక్కువేనన్న అభిప్రాయం సిఎంకు ఉంటుందని ఇదంతా వ్యవసాయశాఖ మంత్రిపై సిఎంకు ఉన్న కోపమే తనపైనా పడిందని..వాస్తవానికి తనపై సిఎంకు ఎటువంటి కోపం ఉండదని 'రాజప్ప' సంతృప్తి పడుతున్నారట.

(205)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ