WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.444కే విమాన ప్రయాణం...!

విమానయాన సంస్థలు మాన్‌సూన్‌ ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి. ఒక సంస్థకు మించి మరో సంస్థ భారీ ఆఫర్‌లు ప్రకటిస్తూ ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌ ఆఫర్‌ ను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఐదు రోజుల తగ్గింపు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 అని తెలిపింది. ఈ ఆఫర్‌ స్పైస్‌జెట్‌ నాన్‌ స్టాప్‌, దేశీయ విమానాలు ద్వారా జమ్మూ-శ్రీనగర్‌, అహ్మదాబాద్‌-ముంబై, ముంబై-గోవా, ఢిల్లీ-డెహ్రాడూన్‌, ఢిల్లీ-అమృత్‌ సర్‌ మార్గాల్లో రూ 444 లు ఒక వైపు బేస్‌ ఛార్జీగా ఉంటుందని తెలిపింది.అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మాన్‌ సూన్‌ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ప్రయాణాలు చేయవచ్చని పేర్కొంది.

(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ