WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్రగడ' ప్రాణాలే ముఖ్యం...!

'కాపు' ఉద్యమనేత 'ముద్రగడ' ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా తాము పనిచేశామని, ఆయన కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ వివరణ ఇచ్చారు. 'ముద్రగడ'ను హాస్పటల్‌కు తరలించే క్రమంలో ఆయన వర్గీయులతో పోలీసులకు ఘర్షణమాత్రమే జరిగిందని, వారిని తిట్టడం కానీ, కొట్టడం కానీ చేయలేదని ఆయన తెలిపారు. 'ముద్రగడ' ఆత్మహత్య చేసుకుంటానంటే చట్టం ఒప్పుకోదని అందుకే ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు రక్షించడమే తమ ఏకైక లక్ష్యంగా భావించామని అందుకే అవ్యవహరించాల్సి వచ్చిందన్నారు.

(173)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ