లేటెస్ట్

సర్వేలన్నీ ‘సైకిల్’ వైపే...!

మరో నెలరోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధిస్తుందని పలు జాతీయ సర్వే సంస్థలు చెబుతున్నాయి. 175/175 సీట్లు సాధిస్తామని, ‘సిద్ధం’ అంటూ తొడలు గొడుతున్న అధికార వైకాపా ఘోరపరాజయం పాలవుతుందని రెండు సర్వే  సంస్థలు పేర్కొన్నాయి. సర్వేల్లో విశ్వసనీయతకు మారుపేరైన ‘సీ`ఓటర్‌’, మరో ప్రముఖ మీడియా సంస్థ అయిన న్యూస్‌`18 సంస్థలు వచ్చే ఎన్నికల్లో ‘టిడిపి’ కూటమి ఘనవిజయాన్ని సాధిస్తుందని పేర్కొంది. ‘ఎబీపీ`సీ ఓటర్‌’ సర్వే ప్రకారం ‘టిడిపి కూటమి’ 20 పార్లమెంట్‌ స్థానాలను సాధిస్తుందని, అధికార వైకాపా కేవలం 5 పార్లమెంట్‌ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చింది. న్యూస్‌`18 ప్రకారం టిడిపి కూటమికి 18 పార్లమెంట్‌ స్థానాలు, వైకాపాకు 7 స్థానాలు వస్తాయని పేర్కొంది. అదే విధంగా ‘టిడిపి కూటమి’కి 50శాతం ఓట్లు, వైకాపాకు కేవలం 41శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.


2014లో విజయం సాధించిన ‘టిడిపి`బిజెపి కూటమి’ మళ్లీ అదే ఫీట్‌ను మరోసారి చేయబోతోందని సర్వే తేల్చింది. పార్లమెంట్‌ స్థానాలను బట్టి చూసుకుంటే అసెంబ్లీ స్థానాల్లో ‘టిడిపి కూటమి’కి భారీగా ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని స్పష్టం అవుతోంది. ఏబీపీ`సీ ఓటర్‌ సర్వే సంస్థ ‘ఫిబ్రవరి’లో పేర్కొన్న సర్వేలో వైకాపాకు 8 పార్లమెంట్‌ స్థానాలు వస్తాయని చెప్పగా, ఇప్పుడు దానిలో ఒకటి తగ్గి ఐదుకు పరిమితం అవుతుందని పేర్కొంది. అంటే ఒక్క ఫిబ్రవరిలోనే మూడు స్థానాలను వైకాపా పోగొట్టుకుదని స్పష్టం అవుతోంది. నోటిఫికేషన్‌ రాకముందే..‘జగన్‌’ బలం విపరీతంగా తగ్గతుండడంతో..ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత దాని పతనం మరింత వేగంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వైకాపా అనుసరిస్తోన్న కక్షపూరిత రాజకీయాలవల్ల ప్రజలు తమ మనస్సుల్లో ఉన్న భావాలను ఇప్పటి వరకు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. అయితే..ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత వారు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, దీని వల్ల..వైకాపా మరింత బలహీనం అవుతుందనే అంచనాలు ఉన్నాయి.  కాగా తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో 10 సీట్లు కాంగ్రెస్‌కు, బిఆర్‌ఎస్‌కు 2, బిజెపికి నాలుగు, ఎంఐఎంకు ఒకటి వస్తోందని ‘ఎబీపీ`సి సర్వే తేల్చింది. అయితే న్యూస్‌`18 సర్వేలో మాత్రం ‘బిజెపి’కి 8 సీట్లు, కాంగ్రెస్‌కు 6, బిఆర్‌ఎస్‌కు 2, ఎంఐఎంకు ఒకటి వస్తుందని తన ఓపీనియన్‌ పోల్‌లో తెలిపింది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ