WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సరిగా పనిచేయకపోతే...చితక బాదుడే...!

ఉద్యోగులు సంస్థల్లో సరిగా పనిచేయకపోతే..మనం ఏమి చేస్తాం... మందలిస్తాం..ఆపై తిడతాం...తరువాత నోటీసులు ఇచ్చి..ఇంటికి పంపిస్తాం.. చైనాలో అయితే ఏం చేస్తారో తెలుసా...? పనిచేయని ఉద్యోగులనందరినీ వరుసలో నిలబెట్టి దొడ్డు కర్రతో చితకబాదుతారు..అవును..మీరు విన్నది నిజమే..తాజాగా చైనాలో ఉద్యోగులను చితకబాదుతున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. చాంగ్‌ రీ­ ఝాంగ్‌ జె గ్రామీణ వాణిజ్య బ్యాంకు ఉద్యోగులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పని విషయంలో బాగా వెనుకబడిన ఎనిమిది ఉద్యోగులను వీరిలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఓ వేదికపై నిలబెట్టి...మీరు ఎందుకు సరిగా పనిచేయడం లేదని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఆ ఎనిమిది మంది సమాధానం ఇవ్వగా...సరిగా పనిచేయనందుకు ఫలితం అనుభవించండి..అంటూ పడవ తెడ్డులాంటి కర్రతో ఆ వ్యక్తి ఎనిమిది మంది వెనుకభాగంలో బాదాడు. అందులో ఓ మహిళ ఈ దెబ్బలు తాళలేక చేతులు వెనక్కి పెట్టినా ఆ చేతులు తీయమని చెప్పి మరీ కొట్టారు..ఈ చర్యపై చైనా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



(601)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ