WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బదిలీల గడువు పెంపుకు 'బాబు' నో...!

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులపై అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు, అమాత్యులు తనను దోషిగా నిలబెడుతున్న వైనంపై ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సంతృప్తి పరచడానికి ఈ గడువును మరో రోజుకు పెంచారు. అయినప్పటికీ అధికారపార్టీ నాయకులకు బదిలీల సందర్భంగా పైరవీలకు పాల్పడే అవకాశం లభించకపోవడంతో వారు ఇంకా నసుగుతూనే ఉండడంతో 'చంద్రబాబు' కఠినంగా వ్యవహరిస్తూ మరోసారి బదిలీల గడువు పెంపుకు 'నో' చెప్పారు. బుధవారంనాడు ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా సర్వీసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులీలకు సిఎం అనుమతి ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కొంత మంది జిల్లా కలెక్టర్లు ఆయనతో స్వయంగా మాట్లాడి బదిలీలు నిలిపివేయాలని కోరారు. బదిలీలు చేస్తామని చంద్రబాబు అన్నారో లేదో తెలియదు కానీ..జీరో సర్వీసు బదిలీకి ఉత్తర్వులు శుక్రవారం విడుదల అవుతాయని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ బదిలీలు చేసే ప్రసక్తే లేదని ఇంతటితో దీన్ని ముగిద్దామని అర్థరాత్రి ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో బదిలీలు కోసం వేచి చూస్తున్న వారు నిరాశపడ్డారు. గత రెండేళ్లు నుండి ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించుకున్న అధికారపార్టీ రాజకీయ నాయకులు ఈసారి బదిలీలపై కఠినంగా వ్యవహరించడంతో తనను బాధ్యుడిగా చేస్తూ సాగిన ప్రచారంపై చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అధికారపార్టీ వర్గాలకు తాను ఎంతగా సహకరించినా, ఎన్ని పనులు చక్కబెట్టినా సంతృప్తి చెందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'నన్ను ఇదివరకటి బాబూలా చూడాలనుకుంటున్నారా? అని హెచ్చరిస్తున్నారట. ఏది ఏమైనప్పటికీ బదిలీల విషయంలో 'చంద్రబాబు' కఠిన వైఖరి అవలంభించడంతో జిల్లాల కలెక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.

(233)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ