WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాల్‌గర్ల్‌'గా హీరోయిన్‌ 'మాధవీలత'...!(వీడియా చూడండి)

'నచ్చావులే' సినిమాతో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించిన 'మాధవీలత' ఇప్పుడు కాల్‌గర్ల్‌ పాత్ర పోషించబోతోంది. 'నచ్చావులే'సినిమా హిట్‌ అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ అమ్ముడు సి గ్రేడ్‌ సినిమాలపై దృష్టిసారించిందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అదీ గాక షార్ట్‌ఫిలింస్‌పై కూడా దృష్టిసారించిందట. 'ఆన్‌ మోనాస్‌ బర్త్‌ డే' అనే షార్ట్‌ ఫిలిమ్‌లో అమ్మడు 'కాల్‌గర్ల్‌'గా కనిపించబోతోందట. నరేంద్ర నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలిం టీజర్‌ ను తాజాగా యూట్యూబ్‌ లో విడుదల చేశారు.ఇందులో తన పాత్ర గురించి అడుగగా.. 'కాల్‌ గర్ల్‌' పాత్ర పోషించడం సవాల్‌ తో కూడుకున్నదని, అందుకే తాను ఈ పాత్రకు ఒప్పుకున్నానని మాధవీలత తెలిపింది. అపార్ట్‌ మెంట్‌ పార్కింగ్‌ ప్రదేశంలో నడుచుకుంటూ వస్తున్న మాధవీలతను ఇందులో చూపించారు. మరో సీన్‌ లో కారులో చిన్నారితో మాట్లాడుతూ ఆమె కనిపించారు. ఆమె, ఆమె ఏడేళ్ల కొడుకు ఇతివృత్తంగా ఈ షార్ట్‌ ఫిలిం తెరకెక్కినట్టు చిత్రవర్గాలు తెలిపాయి.

(119)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ