WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భగ్గుమన్న 'బంగారం'...!

అందరూ అంచనా వేసినట్లే 'బ్రైగ్జిట్‌' ప్రభావంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌లన్నీ పతనం అయ్యాయి. దీంతో 'బంగారం' ధరలు చుక్కలను అంటాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుందన్న వార్తల ప్రభావంతో అటు వివిధ కరెన్సీ మార్కెట్లపై నెగెటివ్‌ గా ఉండగా ... బులియన్‌ మార్కెట్‌ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిన్న నష్టాల్లో ఊగిసలాడిన పుత్తడి ధరలు శుక్రవారం పరుగులు పెడుతూ దూసుకుపోతున్నాయి. ఒకప్పటి బూం తర్వాత మళ్లీ తొలిసారి 31 వేలను దాటి రాకెట్‌ లా నింగిలోకి దూసుకుపోతున్నాయి. ఆరుశాతానికి పైగా లాభపడి మూడేళ్ల గరిష్ట స్తాయికి చేరుకుంది. ఎంఎసీఎక్స్‌ మార్కెట్‌ లో పసిడి10 గ్రా. 31 రూ. లక పైన స్థిరంగా ఉంది. 1794 రూపాయలు లాభపడి 31,708 దగ్గర ట్రేడవుతూ మదుపర్లను మురిపిస్తోంది.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ