WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బంగ్లాదేశ్‌'లో పెరుగుతున్న 'హిందూ' జనాభా...!

ప్రపంచం మొత్తం మీద 'హిందూ'లు తగ్గిపోతున్నారని ఆందోళన చెందుతున్న హిందూమతసంస్థలకు ఇది ఊరటనిచ్చే వార్తే. ముస్లింలు ఎక్కువగా నివసించే 'బంగ్లాదేశ్‌'లో హిందుల జనాభా పెరుగుతోందట. బంగ్లాదేశ్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌(బీబీఎస్‌) విడుదల చేసిన నివేదిక 2015వ సంవత్సరాంతానికి బంగ్లాదేశ్‌లోని మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య 10.7 శాతమని పేర్కొంది. బంగ్లాదేశ్‌ జనాభా 15.89 కోట్లు కాగా అందులో హిందువుల సంఖ్య 1.7 కోట్లగా నివేదికలో తెలిపింది. 2014లో నిర్వహించిన లెక్కల్లో హిందువుల జనాభా 1.55 కోట్లు ఉంది. 2014 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే హిందువుల సంఖ్య 15 లక్షలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ లెక్కలు పూర్తిగా ర్యాండమ్‌ శ్యాంపిల్‌ ద్వారా లెక్కించినవని బీబీఎస్‌ పేర్కొంది.

(286)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ