WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.97/-కే.. 10జిబి 4జీ డేటా...!

రిలయన్స్‌ సంస్థ మరో భారీ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 97రూపాయలకు 10జిబి 4జి డేటాను అందించబోతోంది. రిలయన్స్‌ జియోస్‌ నెట్‌వర్క్‌ పొందినవారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 12 సర్కిల్స్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. వచ్చేవారం నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. రిలయన్స్‌ జియో ఇన్‌ఫోకమ్‌ 4జీ నెట్‌వర్క్‌ తీసుకున్న వారికి మాత్రమే ఇది లభించనుంది. సీడీఎమ్‌ఏ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. దీని ప్రకారం ఆర్‌కామ్‌ సీడీఎమ్‌ఏ కస్టమర్లు 4జీ కి అప్‌డేట్‌ చేసుకుంటే చాలు. అయితే ఈ డేటా ప్యాక్‌కు సంబంధించిన ధరలు ఒక్కో సర్కిల్‌లో ఒక్కో విధంగా ఉండొచ్చని సంస్థ తెలిపింది. ఏ సర్కిల్‌లోనైనా 93 రూపాయల నుంచి 97 రూపాయల మధ్యలోనే ఉంటుందని రిలయన్స్‌ తెలిపింది.

(187)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ