WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఈయూ'కు మరో దెబ్బ...!

బ్రిటన్‌ ఎగ్జిట్‌ దెబ్బతో అ 'యూరోపియన్‌ యూనియన్‌'కు మరో దెబ్బ తగలబోతోంది. ఇంగ్లాండ్‌ బయటకు రావడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న 'స్విడన్‌' తాము కూడా బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. గురు, శుక్రవారాల్లో ప్రైవేట్‌ సంస్థలు నిర్వహించిన ఓటింగ్‌ లో స్విడిష్‌ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకే మొగ్గుచూపారు.నిజానికి నిన్నమొన్నటి వరకు కూడా స్విడన్‌ లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేదు. ఎప్పుడైతే కల్లోలిత మధ్య ఆసియా దేశాల నుంచి శరణార్థులు రాక పెరిగిందో.. అప్పటి నుంచి వారి మనోభావాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈయూ నంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి వస్తోన్నారు స్విడిష్‌ లు.బ్రిగ్జిట్‌ విషయంలో బ్రిటిషర్లు చెబుతున్న కారణాన్నే స్విడిష్‌ లు కూడా వల్లెవేస్తున్నారు. అది.. తమ దేశాలపై 'బ్రెసిల్స్‌ పెత్తనం'. స్విడన్‌ కు సంబంధించిన కీలక నిర్ణయాలు స్టాక్‌ హోమ్‌ (స్విడన్‌ రాజధాని)లో కాకుండా బ్రెసిల్స్‌ నుంచి వెలువడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఈయూలో ఉండటం వల్ల నష్టమేతప్ప లాభం లేదని, ఈయూలో ఉన్నందుకే శరణార్థుల బాధ్యతలను బలవంతంగా తలకెత్తుకోవాల్సి వస్తోందని ఓటింగ్‌ లో పాల్గొన్న స్విడిష్‌ లు అంటున్నారు.

(316)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ