WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విదేశాల్లో ఐపీఎల్‌...!

ప్రపంచ క్రికెట్‌లో ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇన్నాళ్లూ భారత్‌లోనే ఈ టోర్నీ నిర్వహించిన నిర్వాహకులు ఇప్పుడు విదేశాల్లో ఈ టోర్నీనిర్వహించాలని భావిస్తున్నారు. భారత్‌కు బయట జరిపే ఈ టోర్నీని 'మినీ ఐపీఎల్‌' పేరుతో నిర్వహించనున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా వేదికల అన్వేషణలో ఉన్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకూ ఈ టోర్నీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు అనురాగ్‌ పేర్కొన్నారు.ఇందుకు యూఎస్‌తో పాటు యూఏఈ వేదికలు పరిశీలనలో ఉన్నాయి. 2014లో ఐపీఎల్‌ టోర్నీ జరిగిన యూఏఈలో మినీ టోర్నీ నిర్వహించడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతోంది.



(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ