లేటెస్ట్

వైకాపా పాల‌కుల‌కు ప్రజలే బుద్ది చెబుతారు: కేశినేని శ్వేత

ప్రజ తీర్పుతో గద్దెనెక్కి వారినే హింసిస్తున్న వైకాపా పాల‌కుల‌కు ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని టిడిపి నాయకురాలు కేశినేని శ్వేత అన్నారు. ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చింది ప్రజల‌ సమస్యను తీర్చడానికి కానీ, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకునేందుకు కాదని ఆమె అన్నారు. ప్రతిపక్షంపై వేధింపుల‌కు నిరసనగా కేశినేని భవన్‌ నందు జరిగిన కాగడాల‌ నిరసన ప్రదర్శనలో ఆమె మహిళా నాయకురాళ్లతో కల‌సి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారాన్ని కేవలం కక్షసాధింపు కోసం వాడుతున్నారని, ‘జగన్‌’ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రజల‌ను నమ్మించి అధికారంలోకి వచ్చాక వారి జీవితాల‌ను రోడ్లపైకి తెచ్చారని, టిడిపి తరుపున అసెంబ్లీలో గొంతు వినిపిస్తున్నారనే అక్కసుతో ‘అచ్చెంనాయుడు’ని అరెస్టు చేశారన్నారు. ప్రజాప్రతినిధి, రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తిని రౌడీషీటర్‌లా, బందిపోటు దొంగను అరెస్టు చేసినట్లు పోలీసు ఇంట్లోకి జొరబడి అరెస్టు చేశారని, ఇది అనైతిక చర్య అని ఆమె అన్నారు. ‘జగన్‌’ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల‌తో ప్రజలు విసుగెత్తిపోతున్నారని, వారంతా టిడిపి వైపు చూస్తున్నారని ఇది సహించలేని ‘జగన్‌’ టిడిపి నాయకుల‌పై పగ సాధించేందుకు అరెస్టులు చేయిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల‌ తరుపున నిల‌బడిన వారిని అరెస్టు చేస్తున్నారని, అది అప్రజాస్వామికమని, రాజ్యాంగాన్ని గౌరవించకుండా ‘జగన్‌’ పాల‌న చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.

(628)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ