లేటెస్ట్

అనర్హతా భయంతో టిడిపికే ఓటు వేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు...!

టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీకి దూరంగా ఉన్న ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల‌ సందర్భంగా పార్టీ సూచించిన అభ్యర్థికే ఓటు వేశారని తెలుస్తోంది. టిడిపికి దూరంగా ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే ‘వ‌ల్ల‌భనేని వంశీ, గుంటూరు-2 ఎమ్మెల్యే ‘మద్దాల‌ గిరి, చీరాల‌ ఎమ్మెల్యే ‘కరణం బల‌రాం’లు టిడిపి అభ్యర్థి వర్ల రామయ్యకే ఓటు వేశారని సమాచారం. అయితే ఆ ఓటు చ్లెని విధంగా వేశారని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల‌ ఓట్ల లెక్కింపులో ఈ ఓట్లు చెల్ల‌ని విధంగా ఓటు వేశారంటున్నారు. పార్టీ విప్‌ ఇవ్వడంతో ఈ ముగ్గురూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ ముగ్గురు టిడిపికి ఓటు వేశారని, మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఒకటి అని పెట్టాల్సిన చోట టిక్‌ మార్క్‌ పెట్టినట్లు స‌మాచారం.  దీంతో వారు టిడిపికి ఓటు వేసినా అవి చెల్ల‌వు. కావాల‌నే ఈ ముగ్గురూ..ఈ విధంగా చేశారని, పార్టీ అభ్యర్థికి ఓటు వేయకుండా ప్రత్యర్థి పార్టీకి ఓటు వేస్తే..అనర్హతా వేటు వేస్తారనే భయంతో ఈ విధంగా చేశారని సమాచారం. ఈ విధంగా చేస్తే పార్టీ చర్యలు తీసుకునే అవకాశం లేదని, ఈ విధంగా చేయాల‌ని వైకాపా పెద్దలు ఆదేశించారని అంటున్నారు. మొత్తం మీద..పార్టీని ధిక్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు అనర్హతా భయంతో పార్టీకి ఓటు వేసినా...చెల్ల‌ని విధంగా చేశారు. కాగా..మరో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అవగాహన లోపంతో ‘టిక్‌’ పెట్టారని, దీంతో ఆమె ఓటు కూడా చెల్ల‌కుండా పోయిందంటున్నారు. ఈ విషయంపై ‘చంద్రబాబు’ పార్టీ నాయకుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెకు అవగాహన కల్పించాల్సిన నాయకు ఏమి చేశారని ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి.

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ