లేటెస్ట్

‘కరోనా’కు మందు వచ్చింది...!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ మహమ్మారిని అరికట్టేందుకు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ మందు ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి అయ్యాయని, ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషదాల‌పై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వ‌ల్ప‌, మధ్యస్థ ల‌క్షణాతో బాధపడుతున్న రోగుల‌పై బాగా పనిచేస్తున్నట్లు వ్లెడించింది. ఫాబిప్లూ బ్రాండ్‌ పేరిట ఈ ఔషదాన్ని మార్కెట్లోకి విడుదల‌ చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ మందును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్లెన్‌మార్క్‌ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు  సంస్థ ఛైర్మన్‌ గ్లెన్‌ స్దన్హా తెలిపారు. వైద్యుల‌ సిఫార్సుతో దీన్ని విక్రయిస్తారని, దీని ధర రూ.103/-లుగా ఉంటుందని తెలిపారు. కరోనా బారిన పడినవారు 1800ఎంజీ పరిమాణం కలిగిన మాత్రను తొలి రోజు రెండుసార్లు వేసుకోవాల‌ని, తరువాత 14 రోజుల‌ పాటు 800ఎంజీ పరిమాణం కలిగిన మాత్రల‌ను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాల‌ని తెలిపారు. క్లినికల్‌ ట్రయిల్స్‌ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగుల‌పై ప్రయోగించినప్పుడు సానుకూ ఫలితాలు వచ్చాయని, కరోనా ల‌క్షణాలు స్వల్ప‌, మధ్యస్థాయిలో ఉన్న డయాబెటిక్‌, గుండెజబ్బు వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని వాడవచ్చునని గ్లెన్‌మార్క్‌ ఫార్మా సంస్థ వ్లెడించింది. కరోనాపై ఫాబిప్లూనే తొలి ఓరల్‌ ఔషదమని, దేశంలో ఎన్నడూ లేనంతగా కేసు పెరుగుతుండడంతో దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మందుల‌కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

(299)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ