లేటెస్ట్

‘పది’లో అందరూ పాసే...!

ఈ ఏడాది పదవతరగతి విద్యార్థులందరూ పాసయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరీక్షల‌ను రద్దు చేస్తూ అందరినీ పాస్‌ చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి దాకా..ఎట్టి పరిస్థితులోనైనా పదవతరగతి పరీక్షలు నిర్వహించాల‌ని పట్టుపట్టిన ప్రభుత్వం వివిధ వర్గాల‌ నుంచి వస్తోన్న ఒత్తిడితో పరీక్షల‌ను రద్దు చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. దీంతో పరీక్షలు లేకుండా విద్యార్థుల‌ను పై తరగతుకు ప్రమోట్‌ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ ప్రకటించారు. పరీక్షల‌ నిర్వహణ కోసం విద్యార్థు తల్లిదండ్రులు, జిల్లా కలెక్టర్లు, పోలీసులు, ఇతర విభాగాలు కలిసి పనిచేయాలి. ఇంత మంది ఒకే చోట గుమిగూడటం అంత శ్రేయస్కరం కాదని పరీక్షలు వాయిదా వేశాం. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పరీక్షల‌ను రద్దు చేయాల‌ని ఆదేశించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం జూలై10-17 వరకు పరీక్షలు నిర్వహించాల‌ని భావించింది. పరీక్షల‌ను 11పేపర్లకు కుదించి త్వరగా పూర్తి చేయాల‌ని అనుకున్నా, కరోనా రోజుకు రోజుకు పెరిగిపోతుండడంతో  పరీక్షల‌ను రద్దు చేసి అందర్నీ ప్రమోట్‌ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. 

(200)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ