లేటెస్ట్

క‌న్న‌వారి కలల‌ను సాకారం చేసిన ‘నాగముని`

ఊహతెలియని వయస్సులోనే ఉన్నత విద్యనభ్యసించాల‌నే తపన ఆ తపనకు తగిన కృషి పట్టుదల‌ తనని ఉన్నత పదవులో నిల‌బెట్టింది. తన చిన్నతనంలో కన్నకలల‌ను సాకారం చేసుకున్న కృషీవ‌లుడు ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొని పేదరికాన్ని ఎదిరించి జీవితంలో తాను అనుకున్న ల‌క్ష్యానికి చేరుకున్నాడు. జీవితంలో కొందరు దేవుడు ఇచ్చిందే అదృష్టంగా భావిస్తారు, మరికొందరు జీవితాన్ని పిండి తనకు కావల‌సినదాన్ని నెరవేర్చుకుంటారు. ఈ రెండవ కోవకుచెందినవారే గంజాయి నాగముని. ఈయన తల్లిపేరు గంజాయి లైసమ్మ, తండ్రి గంజాయి పెద్ద రంగయ్య వీరికి నాలుగవ సంతానం గంజాయి నాగముని. తల్లిదండ్రుల‌కు చదువు లేకపోయినప్పటికీ పిల్ల‌లు ఉన్నత విద్యనభ్యసించాల‌ని కోరుకున్నారు. లైసమ్మ,పెద్దరంగయ్యల‌కు ఆరుగురు సంతానం. వీరిలో ముగ్గురు మగసంతానం, ముగ్గురు ఆడసంతానం. అందరిలోకి చురుకైన కుమారుడు నాలుగవ కుమారుడు గంజాయి నాగముని. తల్లిదండ్రు పేదవారైనందు వ‌ల్ల పిల్ల‌ల‌ను ప్రభుత్వ పాఠశాల్లోనే చదివించారు. నాగముని ఓర్వకల్లు మండంలోని సొంత ఊరు భైరాపురము గ్రామం ప్రాథమిక పాఠశాల‌లో 1వ తరగతినుండి 5వ తరగతివరకు చదుకున్నారు. 6వతరగతి నుండి 8వ తరగతి వరకు నన్నూరు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల‌లో చదివి 8వ తరగతినుండి 10వ తరగతి వరకు వెల్దుర్తి ఉన్నత పాఠశాలో చదివి 10తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్‌మీడియట్‌ డోన్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజిలో చదివి లా డిగ్రి 5సం.లు కోర్సు 2003నుండి 2008(ఎల్‌.ఎఫ్‌.నెం.759/2008) కి పూర్తి చేసుకొని కర్నూలు జిల్లా బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాద వృత్తి (ఎల్‌.ఎఫ్‌.నెం.982/2008)లో ప్రారంభించారు. 

తన సీనియర్‌ న్యాయవాదులైన ఆర్‌ ఆనందరావు, వై శ్రీనివాసు దగ్గర జూనియర్‌గా పనిచేసి 2011 సం.నుండి స్వయంగా ప్రాక్టీసు ప్రారంభించి సివిల్‌, క్రిమినల్‌ కేసులు చేపట్టి 2014నుండి 2017 వరకు జిల్లా కారాగారము ఉచిత న్యాయసేవా కేంద్రమునకు న్యాయవాదిగా జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా ఎంపిక అయ్యారు. జైలులో ఉన్న పేద ఖైదీల‌కు తగిన న్యాయ సహాలు ఇవ్వటమే కాకుండా వారి  కేసుల‌ను ఉచితంగా వాదించి ఎందరికో న్యాయం చేశారు. ఈవిధంగా తాను పేదకుంటుంబంలో పుట్టి వారి కష్ఠాల‌ను అర్ఠంచేసుకున్న మహాను భావుడు అనిపించుకున్నారు. 2018సం.నంబరునె 1వ తేదిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము ద్వారా 4వ అదనపు సెషన్స్‌ కోర్టు అదనపు న్యాయవాదిగా పనిచేసి ప్రభుత్వం ద్వారా బాధితుల‌కు న్యాయ సహాయ సహాకారాలు అందించంతోపాటు నేరస్తుల‌కు తగిన శిక్షలు పడేలా కృషి చేశారు. ఆసేవల‌ను గుర్తించి ప్రభుత్వం 2020వ సంవత్సరము ఉత్తమ సేవా అవార్డు ఇవ్వటం జరిగింది. అంతే కాకుండా 2020జూన్‌ 03వ తేదిన జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ స్పెషల్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా బాధ్య‌త‌లు చేపట్టారు.  ఇదంతా నా తల్లిదండ్రుల‌ శ్రమ, ఆశీర్వాదాలు, అన్నతమ్ముళ్ల సహకారము, అక్కచెల్ల్లె ఆప్యాయత తన కృషి, పట్టుదల‌ తనను ఇలాంటి గొప్పస్థానంలో చేర్చిందని ఆయన అన్నారు. ఇలాంటి ఉన్నత పదవు ఇంకా మరెన్నో చేపట్టాల‌ని మనందరము కూడా కోరుకుందాం.

(416)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ