లేటెస్ట్

గృహానిర్మాణానికి కెడిసిసి రూ.30లక్షల రుణం మంజూరు

కేవలం వ్యవసాయ రుణాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కృష్ణా జిల్లా సహకార కేంద్రబ్యాంకు కొత్తగా గృహానిర్మాణానికి రుణం మంజూరు చేసింది. బ్యాంకు చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావ్ నియమితులయిన తరువాత విభిన్న వర్గాలకు ప్రయోజనం కలిగించేలా కొత్తకొత్త పధకాలను ప్రవేశపెట్టి బ్యాంకు కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగా విజయవాడలోని అయ్యప్పనగర్ వాసి వల్లభనేని అనీల్ కుమార్ నూతన ఇంటినిర్మాణం కోసం రుణం ఇప్పించాలని చైర్మన్ వెంకట్రావ్ కు దరఖాస్తు ను అందచేశారు. వెంటనే స్పందించి న యార్లగడ్డ అనిల్ కుమార్ దరఖాస్తు ను సంబంధిత అధికారులు కు పంపించి నిబంధనల మేరకు రుణం మంజూరు చేయాలని సూచించారు. దరఖాస్తు ను పరిశీలించి న అధికారులు బ్యాంకు పడమట శాఖ ద్వారా రూ.30 లక్షలు రుణం మంజూరు చేశారు. ఈమేరకు బుధవారం ఉదయం కెడిసిసి ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ యార్లగడ్డ ఋణమంజూరు పత్రాలను లబ్దిదారునికి అందచేశారు. ఈ రుణాన్ని వాయిదా పద్దతిలో 140 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వెంకట్రావ్ వివరించారు. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించాలని వెంకట్రావ్ సూచించారు. సకాలంలో రుణం మంజూరు చేయించిన యార్లగడ్డ కు అనిల్ ధన్యవాదాలు తెలిపారు. తమ బ్యాంకు పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టిందని వీటిని జిల్లాలో ని రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, చిరువ్యాపారులు,  వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీఈఓ శ్యామ్ మనోహర్, జీఎం చంద్రశేఖర్, పటమట బ్రాంచ్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విద్యారుణం, తాజాగా గృహనిర్మాణానికి రుణం మంజూరు లో చొరవ చూపిన  పటమట బ్రాంచ్ మేనేజర్ రాంబాబు ని ఈ సందర్భంగా  యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేకంగా అభినందించారు.

(119)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ