లేటెస్ట్

ప్రియాంక‌గాంధీకి షాక్...!

నెల రోజుల్లో బంగ్లా ఖాళీ చేయండి

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆగస్టు 1 లోగా న్యూ ఢిల్లీలోని తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. న్యూఢిల్లీ లోధి ఎస్టేట్‌లోని నెంబర్ 35 ప్రభుత్వ బంగళాను నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని సూచించింది. ఆగస్ట్ ఒకటిలోగా ఆమె బంగళాను ఖాళీ చేయాలి. 23 సంవత్సరాలుగా ప్రియాంక ఇక్కడ ఉంటున్నారు. ఇంటి అద్దెకు సంబంధించి ఆమె ప్రభుత్వానికి 3, 46, 677 రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రియాంకకు ప్రస్తుతం ఎస్పీజీ రక్షణ లేదు. కేవలం జడ్ ప్లస్ కేటగిరి రక్షణ ఉంది. దీంతో ప్రభుత్వ బంగళా ఖాళీ చేయాల్సి ఉంటుందని హోం శాఖ వర్గాలు తెలిపాయి. మార్చబడిన ప్రభుత్వ కేటాయింపు నిబంధనల ప్రకారం, ఎస్పిజి రక్షకులు మాత్రమే ప్రైవేటు పౌరులుగా ప్రభుత్వ వసతికి అర్హులు.

(196)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ