లేటెస్ట్

‘రఘు’పై అనర్హత వేటు పడుతుందా..!?

తమకు పంటికింద రాయిలా తిప్పలు పెడుతున్న నర్సాపురం ఎంపీ ‘రఘురామకృష్ణంరాజు’ వ్యవహారాన్ని తేల్చేయాల‌ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. నిన్నటి దాకా ఆయన విషయంలో ఆచితూచి వ్యవహరించిన వైకాపా ఇక ఆయనపై కఠినంగా వ్యవహరించి, అనర్హత వేటు వేయించాల‌ని కసరత్తులు చేస్తోంది. పార్టీ క్రమశిక్షణ పాటించినందున ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘విజయసాయిరెడ్డి’ ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు చెల్ల‌వ‌ని, అవి తమ పార్టీవి కాదని ‘రఘు’ కొత్తరకం ఇరకాటం పెట్టడంతో పాటు, ఢిల్లీ వెళ్లి స్పీకర్‌, హోంమంత్రి, ఇతర మంత్రుల‌ను కల‌వడంతో ఇక ఆయన తమ దారికి రారని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం కంటే ఏకంగా ఆయన సభ్యత్వాన్నే రద్దు చేయించి ఆయనకు గుణపాఠం నేర్పాల‌నే ఉద్దేశ్యంతో వైకాపా పెద్దలు వ్యూహాల‌ను రచిస్తున్నారు. దీనిలో భాగంగా రేపు ఎంపీను ఢిల్లీ పంపి లోక్‌సభ స్పీకర్‌కు ఆయనపై ఫిర్యాదు చేయించబోతున్నారు. ఒక ఎంపీపై ఫిర్యాదు చేయడానికి అంత మంది ఎంపీలు హ‌స్తిన   వెళుతుండడం ఆసక్తికల్గించేదే. గతంలో పార్టీ క్రమశిక్షణ ఉ్లంఘించిన ‘శరత్‌యాదవ్‌’ వలే ‘రఘురామకృష్ణంరాజు’పై స్పీకర్‌ అనర్హత వేటు వేయాల‌ని ఎంపీలు కోరబోతున్నారు. అయితే ‘శరత్‌యాదవ్‌’ ప్రత్యర్థి పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అనర్హతకుగురయ్యారు. ఇక్కడ మాత్రం ‘రఘురామకృష్ణంరాజు’ అటువంటి చర్యల‌కు ప్పాడలేదు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి పాల్ప‌డుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వ‌ల్ల‌ ప్రజల‌కు ఇబ్బంది కలుగుతుందని, దాన్నే తాను అధిష్టానం దృష్టికి తెచ్చానని, దీనికి అనర్హత వేటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా..‘రఘు’ను పార్టీ నుంచి బహిష్కరించకుండా, ఆయన పార్లమెంట్‌ సభ్యత్వంపై అనర్హతవేటు వేయించాని భావిస్తున్న వైకాపా వ్యూహం ఎంత వరకు పనిచేస్తోందో చూడాలి. ఒక వేళ వైకాపా ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ సానుకూల‌ నిర్ణయం తీసుకోకపోతే...అప్పుడు వైకాపా నాయకత్వం ఏమి చేస్తుందో చూడాలి మరి. కాగా..పార్టీ ఎంపీలు ఢిల్లీ వెళ్లనుండ‌డంపై ‘రఘురామ’ స్పందిస్తూ ప్రజల‌ సొమ్ముతో ఇంత మంది ఎంపీలు అక్క‌డ‌కు   వెళ్లి ఏమి చేస్తారో అర్థం కావడం లేదని, ఇక్కడ నుంచే ఫిర్యాదు చేయవచ్చుకదా..అని ప్రశ్నిస్తున్నారు.

(251)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ