WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజన్‌'కు 'మోడీ' కితాబు...!

తమ పార్టీ నేతలే ఆయనను సగం భారతీయుడని, విదేశాల ఏజెంట్‌ అని విమర్శిస్తున్నా ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి పెదవి విప్పారు. ఇదంతా ఎవరి గురించో కాదు. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ రఘురామరాజన్‌ గురించి. 'రఘురామరాజన్‌' దేశభక్తి గురించి తాను శంకించలేదని, అందరికన్నా ఆయనకు దేశభక్తి ఎక్కువే ఉందని 'మోడీ' వ్యాఖ్యానించారు. యూపిఎ నియమించిన 'రాజన్‌'ను ఎన్‌డిఎ సర్కారు తొలగిస్తుందని ప్రచారం చేశారని, కానీ తాము అలా చేయలేదని, ఆయన పూర్తి కాలం పదవిలో ఉంటారని మోడీ 'టైమ్స్‌నౌ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇన్నాళ్లూ బిజెపినేత 'సుబ్రహ్మణ్యస్వామి' తదితరలు చేసిన వ్యాఖ్యలపై మౌనం వహించిన 'మోడీ' ఇప్పుడు నోరు తెరవడంతో ఇప్పుడు వారి నోళ్లు మూతపడనున్నాయి.

(180)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ