సచివాలయంలో ‘గుప్తనిధుల’ కలకలం..!
కాంగ్రెస్ నేత ‘రేవంత్రెడ్డి’ తెంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సచివాలయాన్ని కెసిఆర్ ప్రభుత్వం గుప్తనిధుల కోసమే కూల్చివేస్తుందని, సచివాయంలోని ‘జి’ బ్లాక్ కింద నిజాం నవాబు దాచిపెట్టిన ‘నిధి’ ఉందని, దాన్ని తీసుకునేందుకే ‘కెసిఆర్’ ‘కరోనా’ సమయంలోనూ సచివాయాన్ని కూల్చి వేస్తున్నారని ఆరోపించారు. సచివాలయాన్ని పగలు పూట కాకుండా అర్థరాత్రి కూల్చివేయడం కూడా ‘గుప్తనిధుల’ కోసమేనని ఆయన విమర్శించారు. సచివాలయాన్ని కూల్చివేసే ప్రాంతానికి ఎవరినీ రాకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పనులు కానీయడం వెనుక పలు అనుమానాలు ఉన్నాయన్నారు. సచివాలయంలోని ‘జీ’ బ్లాక్ అత్యంత పురాతనమైందని, ఆ భవాన్ని ‘నిజాం’ నిర్మించాడని, దాని కింద సొరంగం ఉందని, దానిలో భారీగా నిధులను ‘నిజాం’ దాచిపెట్టారని, ఈ విషయంపై ‘నమస్తే తెంగాణ’ పత్రికలోనూ గతంలో వార్తలు వచ్చాయని ఆయన వాటిని మీడియాకి చూపించారు.
‘జి’ బ్లాక్ నుంచి ‘మింట్ కాంపౌండ్’ వరకు, హోంసైన్స్ కాలేజీల్లోనూ సొరంగాలు ఉన్నాయని, వీటిలో నిధులు ఉన్నాయని గతంలో జీహెచ్ఎంసీ పురావస్తు శాఖకు లేఖ రాసిందని, ఇప్పుడుఆ లేఖ ఏమైందో తెలియదని ఆయన పేర్కొన్నారు. ప్రొక్రాన్ అణు పరీక్షలను కూడా ఇంత రహస్యంగా నిర్వహించలేదని, ఇప్పుడు మాత్రం భవనాల కూల్చివేతలో మాత్రం అంత రహస్యాన్ని పాటిస్తున్నారని దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ‘కరోనా’ సమయంలో ‘సచివాలయం’ కూల్చివేతపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘కరోనా’ను కట్టడి చేయడం చేత కాక..సచివాలయ కూల్చివేతతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ‘రేవంత్రెడ్డి’ గుప్తనిధుల విషయం బయటకు తేవడం అధికార టిఆర్ఎస్కు షాక్ తగిలే వ్యవహారమే. ఇప్పటికే ఎందుకు సచివాలయాన్ని కూల్చివేస్తున్నారో..? అంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమిటో అనే ప్రశ్నలు తెలంగాణ సమాజం నుంచి వస్తుండగా..ఇప్పుడు ‘రేవంత్రెడ్డి’ చేసిన ఆరోపణలు వారికి మరింత ఇరకాటంగా తయారయ్యాయనడంలో ఎటువంటి సందేహం లేదు.